News August 20, 2025
ప్రకాశం: డీఎస్సీ సెలెక్టెడ్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్!

ఉమ్మడి జిల్లా పరిధిలో డీఎస్సీ – 2025కు సంబంధించి వివిధ కేటగిరీలో మొత్తం 629 పోస్టుల భర్తీ కోసం ఎంపిక కాబడిన అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తున్నట్లు డీఈవో కిరణ్ కుమార్ బుధవారం తెలిపారు. సెలెక్ట్ కాబడిన అభ్యర్థుల మొబైల్ ఫోన్లకు మెసేజ్ వస్తుందన్నారు. వెరిఫికేషన్ కోసం ఒంగోలులోని సరస్వతి జూనియర్ కళాశాల వద్దకు రావాలని, ఒరిజినల్, కాపీ పత్రాలతో మొబైల్‌కు వచ్చిన తేదీల ఆధారంగా రావాలన్నారు.
Similar News
News August 21, 2025
పొదిలి: టీ తాగి వస్తానని భర్త పరార్.!

పొదిలిలోని పోతవరానికి చెందిన యువకుడు ప్రేమించి వివాహం చేసుకున్న భార్యకు మొహం చాటేసి పరారయ్యాడు. ఈ మేరకు బాధితురాలు బుధవారం పొదిలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తెలంగాణలోని ఆర్మూరు బస్ స్టేషన్‌లో టీ తాగి వస్తానని వదిలేసి పరారయ్యాడని, తీరా పొదిలికి వస్తే రూ.10 లక్షలు తెస్తేనే భార్యగా అంగీకరిస్తానని చెబుతున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News August 21, 2025
పొదిలి: టీ తాగి వస్తానని భర్త పరార్.!

పొదిలిలోని పోతవరానికి చెందిన యువకుడు ప్రేమించి వివాహం చేసుకున్న భార్యకు మొహం చాటేసి పరారయ్యాడు. ఈ మేరకు బాధితురాలు బుధవారం పొదిలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తెలంగాణలోని ఆర్మూరు బస్ స్టేషన్‌లో టీ తాగి వస్తానని వదిలేసి పరారయ్యాడని, తీరా పొదిలికి వస్తే రూ.10 లక్షల తెస్తేనే భార్యగా అంగీకరిస్తానని చెబుతున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News August 21, 2025
ఒంగోలు: బాలికను గర్భిణీని చేసిన వ్యక్తికి 20 ఏళ్ల జైలు

పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి బాలికను గర్భవతిని చేసిన వ్యక్తికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ ఒంగోలు పోక్సో కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. 2019 జనవరిలో కొత్తపట్నంలో నిందితుడు చంటి బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. దీనిపై విచారణ అనంతరం నిందితుడికి శిక్ష పడింది. పోలీసులను ఎస్పీ దామోదర్ అభినందించారు.