News August 20, 2025

ప్రైవేటు విద్యాసంస్థల్లో రిజర్వేషన్ తేవాలి: కాంగ్రెస్

image

SC, ST, OBC విద్యార్థులకు ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థల్లో రిజర్వేషన్స్ కల్పించేలా కేంద్రం చట్టం చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. స్టాండింగ్ కమిటీ సిఫార్సు మేరకు SC విద్యార్థులకు 15%, STలకు 7.5%, OBCలకు 27% రిజర్వేషన్ కల్పించాలని కోరింది. ‘ప్రస్తుతం బంతి కేంద్ర ప్రభుత్వం కోర్టులో ఉంది. ఇకపై SC, ST, OBCల డిమాండును కేంద్రం తోసిపుచ్చలేదు’ అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ పేర్కొన్నారు.

Similar News

News March 20, 2026

భారీ ఆఫర్‌ను తిరస్కరించిన రాజస్థాన్ రాయల్స్?

image

IPL జట్టు రాజస్థాన్ రాయల్స్‌ భారీ ఆఫర్‌ను తిరస్కరించినట్లు తెలుస్తోంది. కొలంబియా పసిఫిక్ క్యాపిటల్ పార్ట్‌నర్స్(CPCP) కన్సార్షియం వేసిన $1.7 బిలియన్ల(₹16 వేల కోట్లు) బిడ్‌ను ఫ్రాంచైజీ అంగీకరించలేదని NDTV తెలిపింది. మరింత వాల్యుయేషన్ కోసమే RR ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. RCBని కొనుగోలు చేసేందుకు స్వీడన్‌ కంపెనీ ‘ఈక్యూటీ(EQT)’ ₹18,486 కోట్లకు బిడ్ దాఖలు చేసినట్లు <<19422000>>వార్తలు రావడం<<>> తెలిసిందే.

News March 20, 2026

మరో వివాదంలో పైలట్ రోహిత్ రెడ్డి!

image

TG: డ్రగ్స్ కేసులో <<19404520>>అరెస్టయిన<<>> Ex MLA పైలట్ రోహిత్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. మొయినాబాద్‌లోని ఆయన ఫామ్‌హౌస్ అసైన్డ్ భూమిలో ఉన్నట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారని తెలుస్తోంది. జంగయ్య అనే వ్యక్తి పేరుతో ల్యాండ్ ఉందని సమాచారం. దీంతో ఆ భూమి రోహిత్ రెడ్డి చేతికి ఎలా వెళ్లిందనేది తెలుసుకుంటామని, ఆ తర్వాత చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. అవసరమైతే ఫామ్‌హౌస్‌ను సీజ్ చేస్తామంటున్నారు.

News March 20, 2026

PHOTO GALLERY: గద్దర్ అవార్డుల వేడుక

image

హైదరాబాద్ హైటెక్స్‌లో తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం వైభవంగా జరిగింది. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, చిరంజీవి, కమల్ హాసన్, నాగార్జున, జయసుధ, నారాయణ మూర్తి, రామ్ చరణ్, సహా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు, అవార్డుల విజేతలు హాజరయ్యారు. పైన గ్యాలరీలో కొన్ని ఫొటోలను చూడొచ్చు.