News August 20, 2025
MBNR: PG పరీక్షలు.. 1792 మంది హాజరు

పాలమూరు విశ్వవిద్యాలయంలో పీజీ నాలుగో సెమిస్టర్ పరీక్షలు కొనసాగుతున్నాయి. బుధవారం యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ జిఎన్ శ్రీనివాస్, పరీక్షల నియంత్రణ అధికారిణి డా.ప్రవీణ, పీజీ కాలేజ్ ప్రిన్సిపల్ డా.డి.మధుసూదన్ రెడ్డి, అబ్జర్వర్ డా.నూర్జహాన్ పరివేక్షించారు. మొత్తం 1911 మంది విద్యార్థులకు గాను.. 1,792 మంది హాజరయ్యారని, 64 మంది గైహాజరయ్యారని ఆమె తెలిపారు.
Similar News
News August 21, 2025
నేడు మహబూబ్‌నగర్‌కు సీఎస్

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు గురువారం మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11:30 గంటలకు అమరరాజ కంపెనీ రోడ్డుతోపాటు, భూత్పూర్ మండలం అమిస్తాపూర్-రాందాస్ తండా, అప్పన్నపల్లి-ఇదిరా గ్రామాల మధ్య దెబ్బతిన్న రోడ్లను పరిశీలిస్తారు. అనంతరం ఆయన జిల్లా అధికారులతో రోడ్ల మరమ్మతులు, ఇతర అంశాలపై సమీక్ష నిర్వహిస్తారు.
News August 20, 2025
MBNR: వినాయక చవితి.. DSP కీలక సూచనలు

గణేష్ విగ్రహా మండప నిర్వాహకులకు డీఎస్పీ వెంకటేశ్వర్లు కీలక సూచనలు చేశారు.
✒DJలు వినియోగించరాదు.
✒మండపాల వద్ద CCTV కెమెరాలు అమర్చాలి.
✒భక్తుల కోసం క్యూ లైన్, బ్యారికేడ్లు ఏర్పాటు చేయాలి.
✒రోడ్లపై, కాలిబాటలపై విగ్రహాలను పెట్టరాదు.
✒కేవలం భక్తి గీతాలే వాడాలి.
✒రా.10:00-ఉ.6:00 వరకు స్పీకర్లు నిషేధం.
✒మండపంలో ఎమర్జెన్సీ ల్యాంప్ తప్పనిసరి.
✒వాలంటీర్లందరికి ఫొటో ఐడీ కార్డులు ఉండాలన్నారు.
News August 20, 2025
MBNR: భరోసా సెంటర్లదే కీలకపాత్ర: ఇందిర

మహబూబ్‌నగర్ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో జిల్లా పోలీసు కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్‌లో భరోసా కన్వర్జెన్సీ సమావేశం నిర్వహించారు. జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ అధికారిణి ఇందిర ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భరోసా సెంటర్లు మహిళలు, చిన్నారులు, వృద్ధులు వంటి బలహీన వర్గాల రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ జరీనా, DM&HO కృష్ణ, అదనపు ఎస్పీ బి.ఎన్.రత్నం పాల్గొన్నారు.