News August 20, 2025
ICC ర్యాంకింగ్స్‌లోకి తిరిగొచ్చిన రోహిత్, కోహ్లీ!

టీమ్ ఇండియా బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఐసీసీ వన్డే బ్యాటర్ల <<17464301>>ర్యాంకింగ్<<>> లిస్టులోకి తిరిగొచ్చారు. ఇవాళ ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో వారి పేర్లు మిస్ అయ్యాయి. దీంతో అటు క్రీడా వర్గాల్లో, ఇటు అభిమానుల్లో ఏం జరిగి ఉంటుందన్న చర్చ మొదలైంది. తాజాగా ICC టెక్నికల్ గ్లిచ్‌ను సరిచేయడంతో రోహిత్ 2, కోహ్లీ 4వ స్థానాల్లో ఉన్నట్లు చూపిస్తోంది. కాగా ఈ లిస్టులో గిల్ 1, శ్రేయస్ 8వ ర్యాంకులో ఉన్నారు.
Similar News
News August 21, 2025
ఆన్‌లైన్ గేమ్స్‌తో రూ.20 వేల కోట్లు గుల్ల!

మన దేశంలో ఏటా ప్రజలు ఆన్‌లైన్ గేమ్స్ ఆడి రూ.20,000 కోట్లు పోగొట్టుకుంటున్నట్లు సమాచారం. యాప్‌లు, వెబ్‌సైట్లకు యువత బానిసగా మారుతోంది. కొన్ని రాష్ట్రాల్లో నిషేధం ఉన్నా ఫేక్ లొకేషన్లతో ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతున్నారు. బెట్టింగ్‌లో డబ్బు పోగొట్టుకున్నవారు అడ్డదారులు తొక్కుతున్నారు. దోపిడీ, దొంగతనాలతోపాటు సిగరెట్లు, మద్యం, డ్రగ్స్‌కు కూడా అలవాటు పడుతున్నారు. డబ్బుల కోసం తల్లిదండ్రులను పీడిస్తున్నారు.
News August 21, 2025
‘వ్యూహం’ సినిమా నిర్మాత దాసరి కిరణ్ అరెస్ట్

AP: బంధువుపై దాడి కేసులో ‘వ్యూహం’ సినిమా నిర్మాత దాసరి కిరణ్ కుమార్‌ను విజయవాడ పటమట పోలీసులు అరెస్ట్ చేశారు. మూవీ కోసం తన వద్ద రూ.4.5 కోట్ల అప్పు తీసుకున్న కిరణ్.. అడిగితే అనుచరులతో దాడి చేయించారని ఆయన బంధువు గాజుల మహేశ్ ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి, HYDలో నిన్న ఆయనను అరెస్ట్ చేశారు. కిరణ్ రామదూత క్రియేషన్స్ బ్యానర్‌పై ఆర్జీవీతో వంగవీటి, సిద్ధార్థ్ చిత్రాలనూ తెరకెక్కించారు.
News August 21, 2025
ALERT: భారీ వర్షాలు

TG: తీవ్ర అల్పపీడనం కారణంగా ఇవాళ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొమురం భీమ్ ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, జగిత్యాల, కరీంనగర్, మహబూబాబాద్, మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో పిడుగులతో కూడిన వానలు పడతాయని అంచనా వేసింది. అలాగే గంటకు 30-34 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.