News August 20, 2025

ఈ నెల 23న ఖాతాల్లోకి డబ్బులు

image

AP: గతంలో నిలిచిపోయిన జాతీయ ఉపాధి హామీ పథకం పెండింగ్‌ బిల్లులను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2014-19 మధ్య జరిగిన పనుల బిల్లులను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. పనులు చేసిన ఉపాధి హామీ శ్రామికుల ఖాతాల్లో ఈ నెల 23న రూ.145 కోట్లు జమ చేయనుంది.

Similar News

News August 21, 2025

ఆన్‌లైన్ గేమ్స్‌తో రూ.20 వేల కోట్లు గుల్ల!

image

మన దేశంలో ఏటా ప్రజలు ఆన్‌లైన్ గేమ్స్ ఆడి రూ.20,000 కోట్లు పోగొట్టుకుంటున్నట్లు సమాచారం. యాప్‌లు, వెబ్‌సైట్లకు యువత బానిసగా మారుతోంది. కొన్ని రాష్ట్రాల్లో నిషేధం ఉన్నా ఫేక్ లొకేషన్లతో ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతున్నారు. బెట్టింగ్‌లో డబ్బు పోగొట్టుకున్నవారు అడ్డదారులు తొక్కుతున్నారు. దోపిడీ, దొంగతనాలతోపాటు సిగరెట్లు, మద్యం, డ్రగ్స్‌కు కూడా అలవాటు పడుతున్నారు. డబ్బుల కోసం తల్లిదండ్రులను పీడిస్తున్నారు.

News August 21, 2025

‘వ్యూహం’ సినిమా నిర్మాత దాసరి కిరణ్‌ అరెస్ట్

image

AP: బంధువుపై దాడి కేసులో ‘వ్యూహం’ సినిమా నిర్మాత దాసరి కిరణ్‌ కుమార్‌ను విజయవాడ పటమట పోలీసులు అరెస్ట్ చేశారు. మూవీ కోసం తన వద్ద రూ.4.5 కోట్ల అప్పు తీసుకున్న కిరణ్.. అడిగితే అనుచరులతో దాడి చేయించారని ఆయన బంధువు గాజుల మహేశ్ ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి, HYDలో నిన్న ఆయనను అరెస్ట్ చేశారు. కిరణ్ రామదూత క్రియేషన్స్ బ్యానర్‌పై ఆర్జీవీతో వంగవీటి, సిద్ధార్థ్ చిత్రాలనూ తెరకెక్కించారు.

News August 21, 2025

ALERT: భారీ వర్షాలు

image

TG: తీవ్ర అల్పపీడనం కారణంగా ఇవాళ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొమురం భీమ్ ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, జగిత్యాల, కరీంనగర్, మహబూబాబాద్, మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో పిడుగులతో కూడిన వానలు పడతాయని అంచనా వేసింది. అలాగే గంటకు 30-34 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.