News August 20, 2025

సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న ఆర్కే రోజా

image

సింహాచలంలోని వరాహ లక్ష్మీనరసింహ స్వామిని మాజీ మంత్రి రోజా కుటుంబ సమేతంగా బుధవారం దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి కప్పస్తంభం అలింగనం చేయించారు. అనంతరం స్వామి వారి దర్శనం చేయించారు. వేద పండితులు ఆశీర్వాదం అందజేసి స్వామి వారి చిత్రపటాలు, ప్రసాదాలను అందజేశారు. స్వామివారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలకు శాంతి, ఐశ్వర్యం కలగాలని కోరుకున్నట్లు ఆమె తెలిపారు.

Similar News

News August 21, 2025

విశాఖ: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో మరో ముగ్గురు అరెస్ట్

image

ఆల్‌లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముగ్గురిని విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. విజయనగరం జిల్లాలో మెంటాడకు చెందిన బొడ్డు తిరుపతి (25), గొట్టాపు నాగేంద్రబాబు (25), రాపర్తి నాగేశ్వరరావు(25)ను అరెస్టు చేసి వారి నుంచి 3 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫోన్ల ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటి వరకు 8 మందిని అరెస్ట్ చేయగా.. బుధవారం ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు.

News August 21, 2025

భవనం ఖాళీ చేయించిన అధికారులు

image

విశాఖ వెలంపేట పూలవీధిలో ఒక భవనం మరో భవనంపై కుంగిపోయింది. ఈ విషయాన్ని ముందుగా ఒకరు నగర పోలీస్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన స్పందించి వెంటనే వన్ టౌన్ పోలీసులు, జీవీఎంసీ అధికారులను పంపించారు. పరిశీలన చేసిన వెంటనే ఆ భవనంలో ఉన్న పది కుటుంబాలను ఖాళీ చేయాలని సూచించారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ, ఇతర అధికారులు కూడా పరిశీలించారు. బిల్డర్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

News August 21, 2025

‘విశాఖలో అంతర్జాతీయ స్థాయి స్కేటింగ్ బోర్డు నిర్మాణం’

image

ఏషియన్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్‌లో పతకాలు సాధించిన స్కేటర్లను బుధవారం విశాఖలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గణబాబు, VMRDA ఛైర్మన్ ప్రణవ్ గోపాల్, మెట్రోపాలిటన్ కమిషనర్ విశ్వనాథన్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. రూ.3.50 కోట్లతో అంతర్జాతీయ స్థాయి స్కేటింగ్ బోర్డును విశాఖలో నిర్మిస్తున్నట్టు వెల్లడించారు.