News August 20, 2025

అంతర్ జిల్లా బదిలీలకు దరఖాస్తు చేసుకోండి: DEO

image

ఉపాధ్యాయుల అంతర్ జిల్లా బదిలీలకు దరఖాస్తు చేసుకోవాలని DEO ప్రేమ్ కుమార్ కోరారు. ప్రభుత్వ, జడ్పీ, మున్సిపల్ ఉపాధ్యాయులు మ్యూచువల్, కేటగిరిలో బదిలీలకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. LEAP APP ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు పంపించాలని తెలిపారు. హెచ్ఎం, స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవచ్చు అన్నారు.‌ ఈనెల 24 వరకు MEOలకు దరఖాస్తులు పంపాలన్నారు.

Similar News

News August 21, 2025

భవనం ఖాళీ చేయించిన అధికారులు

image

విశాఖ వెలంపేట పూలవీధిలో ఒక భవనం మరో భవనంపై కుంగిపోయింది. ఈ విషయాన్ని ముందుగా ఒకరు నగర పోలీస్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన స్పందించి వెంటనే వన్ టౌన్ పోలీసులు, జీవీఎంసీ అధికారులను పంపించారు. పరిశీలన చేసిన వెంటనే ఆ భవనంలో ఉన్న పది కుటుంబాలను ఖాళీ చేయాలని సూచించారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ, ఇతర అధికారులు కూడా పరిశీలించారు. బిల్డర్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

News August 21, 2025

‘విశాఖలో అంతర్జాతీయ స్థాయి స్కేటింగ్ బోర్డు నిర్మాణం’

image

ఏషియన్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్‌లో పతకాలు సాధించిన స్కేటర్లను బుధవారం విశాఖలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గణబాబు, VMRDA ఛైర్మన్ ప్రణవ్ గోపాల్, మెట్రోపాలిటన్ కమిషనర్ విశ్వనాథన్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. రూ.3.50 కోట్లతో అంతర్జాతీయ స్థాయి స్కేటింగ్ బోర్డును విశాఖలో నిర్మిస్తున్నట్టు వెల్లడించారు.

News August 21, 2025

స్టీల్ ప్లాంట్లో ప్రమాదం.. కార్మికుడి మృతి

image

స్టీల్ ప్లాంట్‌ లోని ఎస్ఎంఎస్ విభాగంలో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఉద్యోగి మృతి చెందాడు. వడ్లపూడి ప్రాంతానికి చెందిన కర్రీ పైడి కొండయ్య ఎస్ఎంఎస్ విభాగంలోని టెక్నీషియన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. బుధవారం సాయంత్రం విభాగంలోని క్రేన్ పై పనులు చేస్తుండగా జారి పడి అక్కడికక్కడే మృతి చెందాడు. అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.