News August 20, 2025

జాతీయ స్థాయి వాలీబాల్‌కు బొప్పాపూర్ విద్యార్థిని

image

ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన డి.శృతిక జాతీయ స్థాయి అండర్-15 వాలీబాల్ పోటీలకు ఎంపికైంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో శృతిక అద్భుతమైన ప్రతిభ కనబరిచిందని పీడీ అక్బర్ బుధవారం వెల్లడించారు. జాతీయ స్థాయిలో కూడా ఉత్తమ ప్రతిభ చూపి రాష్ట్రానికి మంచి పేరు తీసుకువస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Similar News

News August 21, 2025

భవనం ఖాళీ చేయించిన అధికారులు

image

విశాఖ వెలంపేట పూలవీధిలో ఒక భవనం మరో భవనంపై కుంగిపోయింది. ఈ విషయాన్ని ముందుగా ఒకరు నగర పోలీస్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన స్పందించి వెంటనే వన్ టౌన్ పోలీసులు, జీవీఎంసీ అధికారులను పంపించారు. పరిశీలన చేసిన వెంటనే ఆ భవనంలో ఉన్న పది కుటుంబాలను ఖాళీ చేయాలని సూచించారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ, ఇతర అధికారులు కూడా పరిశీలించారు. బిల్డర్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

News August 21, 2025

గుర్తింపులేని పార్టీలకు షోకాజ్ నోటిసులిచ్చాం: కలెక్టర్

image

గుంటూరు జిల్లాలో రిజిస్ట్రేషన్ చేయబడి 2019 నుంచి ఇప్పటి వరకు ఎన్నికల్లో పోటీచేయని గుర్తింపు లేని పార్టీలకు ఈసీ షోకాజ్ నోటీసులు జారీచేసిందని కలెక్టర్ నాగలక్ష్మీ తెలిపారు. గ్రేట్ ఇండియా పార్టీ, వెనుకబడిన వర్గాల మహిళా రైతు పార్టీలకు నోటీసులు ఇచ్చామని చెప్పారు. ఆ పార్టీల బాధ్యులు ఈనెల 28 లోపు వెలగపూడి సచివాలయం 5వ బ్లాక్ ప్రధాన ఎన్నికల అధికారిముందు వివరణ ఇచ్చేందుకు ఆధారపత్రాలతో హాజరు కావాలన్నారు.

News August 21, 2025

విషాదం.. వేడి పాలు నోటిలో పడి చిన్నారి మృతి

image

వేడి పాలు చిన్నారి ప్రాణం తీశాయి. ఈ విషాద ఘటన గుత్తి కోటలో జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. ప్రతాప్ రెడ్డి, మేనక దంపతుల కుమారుడు షర్మిల్ రెడ్డి (15 నెలల బాలుడు) వేడి చేసిన పాలను తాగడానికి ప్రయత్నించాడు. ప్రమాదవశాత్తు అవి నోరు, ముక్కులో పడ్డాయి. ఊపిరాడకపోవడంతో మరణించాడు. ఈ ఘటనతో కోటవీధిలో విషాదఛాయలు అలుముకున్నాయి.