News August 20, 2025

దాడి తర్వాత షాక్‌కు గురయ్యా: CM రేఖా గుప్తా

image

తనపై జరిగిన దాడి విషయంపై ఢిల్లీ సీఎం <<17460103>>రేఖా గుప్తా<<>> స్పందించారు. ‘దాడి జరగగానే షాక్‌కు గురయ్యా. ఇప్పుడు తేరుకున్నాను. ఇది ఢిల్లీకి సేవ చేయాలనే మా సంకల్పంపై జరిగిన పిరికిపంద చర్య. ప్రజలకు సేవ చేయాలనే నా స్ఫూర్తిని ఇలాంటి దాడులు ఆపలేవు. త్వరలోనే ప్రజల ముందుకు వస్తాను. ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం మునుపటిలాగానే కొనసాగుతాయి. ప్రజల మద్దతే నాకు కొండంత బలం’ అని Xలో పోస్ట్ చేశారు.

Similar News

News March 11, 2026

రాష్ట్ర ప్రజలకు CM ఉగాది కానుక

image

AP: రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు ఉగాది కానుక ప్రకటించారు. ఉగాది రోజున 2.50 లక్షల మంది లబ్ధిదారుల సామూహిక నూతన గృహ ప్రవేశ కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. వారికి ప్రభుత్వం తరఫు నుంచి అధికారిక లేఖ వెళ్లేలా చూడాలని ఆదేశించారు. కాగా 2029 నాటికి రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి సొంతిల్లు ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం ఇప్పటికే స్పష్టం చేశారు.

News March 11, 2026

చిన్న సంస్థ.. పెద్ద దెబ్బ: అమెరికా యుద్ధ రహస్యాలు లీక్

image

చైనాకు చెందిన మిజార్‌విజన్ అనే చిన్న సంస్థ AI సాయంతో అమెరికా యుద్ధ వ్యూహాలను బట్టబయలు చేసింది. ఫిబ్రవరిలో ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ ప్రారంభానికి ముందే ఇజ్రాయెల్, సౌదీలోని అమెరికా వైమానిక స్థావరాలు, యుద్ధ విమానాలు, క్షిపణి వ్యవస్థల హై-రిజల్యూషన్ ఫొటోలను ఈ సంస్థ SMలో విడుదల చేసింది. జిలిన్-1 ఉపగ్రహాల ద్వారా సేకరించిన ఈ సమాచారం ఇరాన్ దాడులకు పరోక్షంగా సహకరించిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

News March 11, 2026

శ్రీనిధి రకం కోళ్ల ప్రత్యేకత ఏమిటి?

image

శ్రీనిధి జాతి కోళ్లు గోధుమ రంగులో ఉంటాయి. నాటుకోడి గుడ్లకు సమానంగా ఈ కోడి గుడ్లు కూడా అధిక పోషకాలను కలిగి ఉంటాయి. ఈ కోళ్లు 5 నెలల వయసు నుంచే గుడ్లను పెట్టడం ప్రారంభిస్తాయి. ఏడాదికి 140 నుంచి 160 గుడ్లను పెడతాయి. అన్ని వాతావరణ పరిస్థితులను, కొన్ని రకాల వ్యాధులను తట్టుకొని జీవిస్తాయి. పొడవైన కాళ్లతో, ఆకర్షణీయంగా ఉంటాయి. పెరటికోళ్లు పెంచాలనుకునేవారికి శ్రీనిధి కోళ్లు కూడా అనుకూలమైనవి.