News April 1, 2024

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి.. పలువురికి గాయాలు

image

డోన్ మండలం గోసానిపల్లె సమీపంలో కరివేపాకు తోట మలుపు వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను కారు ఢీకొనడంతో ప్యాపిలి మండలం కోటకొండకు చెందిన వెంకటేశ్వరరావు అనే వికలాంగుడు అక్కడికక్కడే మృతిచెందారు. అతని కుమారుడికి, ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. కారులో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. గాయాలైన వారిని 108లో ఆసుపత్రికి తరలించారు.

Similar News

News March 27, 2026

వేసవికాలం.. కర్నూలు ఎస్పీ కీలక సూచనలు!

image

వేసవికాలపు సెలవులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో చిన్నపిల్లల భద్రతపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. ఈత రాని పిల్లలు కాల్వలు, కుంటలు, చెరువులు, నదుల వద్దకు వెళ్లి ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ముఖ్యంగా గ్రామాలు, పట్టణ శివారు ప్రాంతాల్లో నీటి వనరుల వద్ద జారిపడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

News March 26, 2026

జనగణన-2027ను కచ్చితంగా నిర్వహించాలి: కలెక్టర్

image

జనగణన-2027 ప్రక్రియను నియమ నిబంధనల ప్రకారం పొరపాట్లకు తావు లేకుండా నిర్వహించాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. గృహ జాబితా, గృహ జనగణన కార్యక్రమాలపై నిర్వహించిన శిక్షణలో ఆమె మాట్లాడారు. హౌస్ మ్యాపింగ్‌ను పకడ్బందీగా చేసి, నమోదు చేసే ప్రతీ వివరంలో కచ్చితత్వం పాటించాలని సూచించారు. అధికారులు పూర్తి శ్రద్ధతో పనిచేసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని తెలిపారు.

News March 25, 2026

కరెంట్ టారిఫ్ పెంపు లేదు: ఏపీఈఆర్సీ

image

2026-27 ఆర్థిక సంవత్సరానికి విద్యుత్ టారిఫ్ పెంపు ఉండదని ఏపీఈఆర్సీ ఛైర్మన్ పీవీఆర్ రెడ్డి తెలిపారు. కర్నూలులో APERC విద్యుత్ నియంత్రణ మండలి కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. పంపిణీ సంస్థలు సూచించిన లోటును తగ్గించి, భారం ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు. గృహ, వ్యవసాయ వినియోగదారులకు ఎలాంటి అదనపు భారం లేదన్నారు. వాణిజ్య టారిఫ్‌ను కూడా తగ్గించినట్లు పేర్కొన్నారు.