News August 20, 2025
నిజామాబాద్: ప్రశాంతంగా PG, B.Ed పరీక్షలు.. 191 మంది గైర్హాజరు

తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న PG, B.Ed పరీక్షలు 7పరీక్షా కేంద్రాల్లో ప్రశాంతంగా జరిగాయని అడిట్ సెల్ డైరెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. బుధవారం జరిగిన PG 2,4సెమిస్టర్ల రెగ్యులర్,బ్యాక్ లాగ్ పరీక్షల్లో 2,366 మందికి గాను 2,240 మంది హాజరవగా,126 మంది గైర్హాజరయ్యారు. B.Ed 2,4సెమిస్టర్ల రెగ్యులర్,బ్యాక్ లాగ్ పరీక్షల్లో 1,444 మందికి గాను 1,379 మంది హాజరవగా 65 మంది గైర్హాజరయ్యారు.
Similar News
News August 21, 2025
ఇలా చేసి కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు!

రోజుకు కనీసం 2.5-3లీటర్ల నీటిని తాగితే కిడ్నీల ఆరోగ్యానికి మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ‘ఉప్పు, ప్రాసెస్డ్&ఆయిల్ ఫుడ్, మాంసాహారాన్ని పరిమితం చేయాలి. సాధ్యమైనంత వరకు పెయిన్ కిల్లర్స్ వాడకం తగ్గించాలి. వ్యాయామం, తగిన నిద్ర, మానసిక ప్రశాంతత అవసరం. మూత్ర విసర్జన ఆపుకోకూడదు. శరీర బరువు పెరిగితే బీపీ, షుగర్ వచ్చే అవకాశముంది. ఈ రెండూ కిడ్నీల డ్యామేజ్‌కు ప్రధాన కారణాలు’ అని చెబుతున్నారు. SHARE IT.
News August 21, 2025
అనకాపల్లి: వరి పొలాల్లో నీరు చేరిందా?

అనకాపల్లి జిల్లాలో 3రోజులు పాటు కురిసిన వర్షాలకు వరి పొలాల్లో చేరిన నీటిని వెంటనే తొలగించాలని జిల్లా వ్యవసాయాధికారి మోహన్‌రావు రైతులకు సూచించారు. నీటిని తొలగించిన తర్వాత ఎకరానికి 40 కిలోల గ్రోమోర్ ఎరువు 28:28:0ను వేయాలన్నారు. నాట్లుకు ముందు దమ్ము పట్టిన రైతులు ఎకరానికి 50 కిలోల డీఏపీ వేసుకోవాలన్నారు. అర్హులైన రైతులకు అన్నదాత సుఖీభవ పథకం అందకపోతే తక్షణం రైతు సహాయ కేంద్రంలో సంప్రదించాలని సూచించారు.
News August 21, 2025
పెండింగ్ చలాన్లు చెల్లించకపోతే వాహనం సీజ్: వరంగల్ CP

వాహనాలపై పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్లను వెంటనే చెల్లించాలని వరంగల్ CP సన్ ప్రీత్ సింగ్ వాహనదారులకు సూచించారు. ఒకవేళ చెల్లించకపోతే, పోలీసులు రోడ్డుపై వాహనాలను నిలిపివేసి, అక్కడే పెండింగ్ చలాన్లను క్లియర్ చేయిస్తారు.. అలా క్లియర్ చేయని పక్షంలో, ఆ వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలిస్తారని CP స్పష్టం చేశారు. కమిషనరేట్ పరిధిలో మొత్తం 1,27,194 వాహనాలపై 11,71,094 చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి.