News August 20, 2025
ADB: ముంబయిలో వర్షాలు.. 2 రైళ్లు రద్దు

ముంబాయిలో భారీ వర్షాల కారణంగా గురువారం రెండు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు పీఆర్వో రాజేశ్ షిండే ఒక ప్రకటన విడుదల చేసింది. గురువారం నాటి జాల్నా-ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు(నంబరు 20705), బల్లార్ష-ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ నందిగ్రాం ఎక్స్‌ప్రెస్ రైలు(నెంబరు 11002) రద్దు చేశామన్నారు. ఆదిలాబాద్ ప్రయాణికులు గమనించాలని సూచించారు.
Similar News
News August 20, 2025
ADB: వైన్స్ షాప్ చోరీ కేసులో ఇద్దరి అరెస్ట్

ఆదిలాబాద్ పట్టణం తిర్పల్లిలోని శ్రీనివాస వైన్స్‌లో గోడకు రంధ్రం చేసి చోరీకి యత్నించిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు టూటౌన్ సీఐ నాగరాజు తెలిపారు. వడ్డెర కాలనీకి చెందిన బిలాల్, చిలుకూరి లక్ష్మీనగర్‌కు చెందిన షారుక్‌తోపాటు మరో ముగ్గురు చోరీకి యత్నించారన్నారు. బుధవారం పంజాబ్ చౌక్‌లో అనుమానస్పదంగా తిరుగుతున్న బిలాల్, షారుక్‌లను అరెస్టు చేశామని, మరో ముగ్గురి కోసం గాలిస్తున్నామని చెప్పారు.
News August 20, 2025
ADB: గంజాయిని విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు

గంజాయిని విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఆదిలాబాద్ టూటౌన్ ఇన్‌స్పెక్టర్ నాగరాజు తెలిపారు. ఎస్ఐ విష్ణుప్రకాష్ బుధవారం పట్టణంలోని రైల్వే స్టేషన్ వద్ద పెట్రోలింగ్ చేస్తున్న సందర్భంగా మహాలక్ష్మీవాడకు చెందిన మసూద్, మహారాష్ట్రకు చెందిన సల్మాన్ అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించారు. వారిని తనిఖీ చేయగా రూ.6,075 విలువైన 243 గ్రాముల ఎండు గంజాయి లభించిందన్నారు.
News August 20, 2025
ADB: ‘బీఎస్పీతోనే బహుజన రాజ్యాధికారం’

బీఎస్పీ ద్వారానే బహుజనులకు రాజ్యాధికారం సాధ్యమని బీఎస్పీ సెంట్రల్ స్టేట్ కోఆర్డినేటర్ అడ్వకేట్ నిషాని రామచంద్రం పేర్కొన్నారు. ఇచ్చోడలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో బీసీలకు 43% రిజర్వేషన్ అమలు చేయడంలో బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. బీజేపీ రాజ్యాంగ రద్దు కోసం కుట్ర చేస్తుందన్నారు. నాయకులు జంగుబాపు, సతీష్ తదితరులున్నారు.