News August 20, 2025

కూకట్‌పల్లి‌‌లో 7.8 ఎకరాలకు రూ.547 కోట్లు

image

కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలోని 7.8 ఎకరాల భూములు ఈ-వేలం ద్వారా రూ.547 కోట్లకు అమ్ముడుపోయాయి. ఎకరాకు రూ.70 కోట్లు చెల్లించి గోద్రేజ్ ప్రాపర్టీస్ ఈ భూములను సొంతం చేసుకుంది. అరబిందో, ప్రెస్టీజ్, అశోక బిల్డర్స్ వంటి సంస్థలు పోటీ పడ్డాయి. వేలంలో గోద్రేజ్ అధిక ధర పలికి భూములను దక్కించుకుంది. ఈ ఆదాయాన్ని పేద, మధ్యతరగతి వర్గాల గృహ నిర్మాణ పథకాలకు వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు.

Similar News

News August 21, 2025

దూసుకుపోతున్న KPHB ‘రియల్’ బిజినెస్

image

రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పూర్తిగా తగ్గుముఖం పడుతోందని వస్తున్న వార్తలను పటాపంచలు చేస్తూ KPHB కాలనీలో ఎకరం ఏకంగా రూ.70 కోట్లు పలికింది. ఐటీ కారిడార్‌కు పక్కనే ఉండడం, కమర్షియల్‌ నిర్మాణాలు శరవేగంగా పెరగుతుండటంతో ఇక్కడి రియల్ వ్యాపారం దూసుకుపోతోందని నిపుణుల అంచనా. గతంలో హౌసింగ్ బోర్డు వేలం వేసిన ప్రతి వేలంపాటలో కూడా ఎక్కడా లేని విధంగా ధర పలుకుతూ వచ్చింది. ఇప్పుడు నగరంలో KPHB హాట్ కేక్‌గా మారింది.

News August 21, 2025

నేడు హైకోర్టులో KCR, హరీశ్‌రావు పిటిషన్లపై విచారణ

image

కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ ఇచ్చిన నివేదికను సవాల్ చేస్తూ KCR, హరీశ్‌రావు 2 వేర్వేరు పిటిషన్లు హైకోర్టులో దాఖలు చేశారు. ఈ కమిషన్ నివేదికపై స్టే ఇవ్వాలనే వీరి పిటిషన్‌పై నేడు విచారణ జరగనుంది. రెండు పిటిషన్లను కలిపి హైకోర్ట్ జడ్జి జస్టిస్ కుమార్ సింగ్ విచారించనున్నారు. దీనిపై BRSకు రిలీఫ్ వస్తుందా? లేక ఏం జరగబోతోందనేది రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

News August 21, 2025

HYD: పెళ్లికాని ప్రసాదులు? జర జాగ్రత్త!

image

సింగల్‌గా ఉన్నారా? జర జాగ్రత్త! పెళ్లికాని ప్రసాదులు ఆకర్షణ బుట్టలో ఇట్టే పడిపోతున్నారు. డేటింగ్ యాప్స్, వాట్సప్, ఇన్‌స్టా, టెలిగ్రామ్‌లో పరిచయం అవుతున్న యువతులు రాత్రి న్యూడ్ కాల్ చేస్తామని చెప్పి రూ.500 నుంచి రూ.2,000 వసూలు చేస్తున్నారు. సింగిల్స్ వీక్నెస్‌ను క్యాష్ చేసుకుని 10 MIN కాల్స్‌తో రూ.వేలల్లో లాగేస్తున్నారు. హోటల్ గదులు బుక్ చేస్తామని చెప్పి, డబ్బులు తీసుకున్నాక హ్యాండ్ ఇస్తున్నారు.