News August 20, 2025

2వ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది: కలెక్టర్

image

గోదావరి వరద ప్రవాహం, ఎగువన కురుస్తున్న వర్షాల వల్ల జిల్లాలో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు కలెక్టర్ వెట్రిసెల్వి బుధవారం తెలిపారు. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం సాయంత్రానికి 47 అడుగులకు చేరుకుందన్నారు. మరో కొన్ని గంటల్లో 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందన్నారు. అందుకు తగిన విధంగా జిల్లా యంత్రాంగం పనిచేస్తుందన్నారు.

Similar News

News March 18, 2026

అనంతపురం మున్సిపల్ ప్రత్యేక అధికారిగా కలెక్టర్ బాధ్యతలు

image

అనంతపురం నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారిగా కలెక్టర్ ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు. కలెక్టరేట్‌లోని ఛాంబర్‌లో అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ప్రభుత్వం జారీ చేసిన GO 284 ప్రకారం ఈ నియామకం జరిగింది. ఆయన మాట్లాడుతూ.. నగర పరిపాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించి, పౌరులకు నాణ్యమైన సేవలు అందించడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తామని తెలిపారు.

News March 18, 2026

రేపు తిరుపతికి అచ్చంపేట నుంచి ఆర్టీసీ బస్సు రద్దు

image

ఈనెల 19 ఉగాది పర్వదినం సందర్భంగా అచ్చంపేట ఆర్టీసీ డిపో నుంచి తిరుపతి పుణ్యక్షేత్రానికి బయలుదేరే ఆర్టీసీ బస్సును రద్దు చేసినట్లు అచ్చంపేట ఆర్టీసీ డిపో మేనేజర్ ప్రసాద్ తెలిపారు. అదేవిధంగా ఈ నెల 20న తిరుపతి నుంచి అచ్చంపేటకు వచ్చే బస్సును రద్దు చేయడం చేశారు. ప్రయాణికులు గమనించాలని ఆయన కోరారు.

News March 18, 2026

తాళ్లూరు: లేఔట్లను పరిశీలించిన జేసీ

image

ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లో జాయింట్‌ కలెక్టర్ కల్పనకుమారి బుధవారం పర్యటించారు. లేఅవుట్ అప్రూవల్ కోసం పెండింగ్‌లో ఉన్న పలు సర్వే నంబర్లలోని భూములను ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రభుత్వ, ప్రైవేటు భవనాల వివరాలను ఆరా తీశారు. క్షేత్రస్థాయిలో నిబంధనల అమలును తనిఖీ చేశారు. ఈ పర్యటనలో అద్దంకి ఆర్డీవోతో పాటు పలువురు తహశీల్దార్లు, సర్వేయర్లు పాల్గొన్నారు.