News August 20, 2025

DSC అభ్యర్థులకు అలర్ట్

image

AP: మెగా DSC 2025 స్కోరు కార్డులకు సంబంధించి టెట్ మార్కుల్లో అభ్యంతరాలకు ఇచ్చిన ఎడిట్ ఆప్షన్ గడువు రేపటితో ముగియనుంది. ఇదే చివరి అవకాశం అని, ఏవైనా అభ్యంతరాలుంటే రేపు మ.12.00లోగా సరిచేసుకోవాలని కన్వీనర్ కృష్ణారెడ్డి సూచించారు. సవరించిన టెట్ మార్కులతో అనుసంధానించిన స్కోర్ కార్డులను <>https://apdsc.apcfss.in/<<>> వెబ్‌సైట్‌లో ఇప్పటికే అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.

Similar News

News March 21, 2026

కాఠిన్యం వెనక కన్నీటి గాథలు.. TG పోలీస్ భావోద్వేగ ట్వీట్

image

కరీంనగర్ 2 టౌన్ SI చంద్రశేఖర్ సూసైడ్ పట్ల TG పోలీస్ భావోద్వేగ ట్వీట్ చేసింది. ‘ఖాకీ వెనక కఠినత్వమే కాదు చట్టాన్ని కాపాడే కళ్లలో కన్నీటి గాథలూ ఉంటాయి. కర్తవ్యనిష్ఠతో కాలం విసిరే కర్కశత్వ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక.. గద్దరించే గొంతు పలకని మాటల భారంతో నిశ్శబ్దం వైపు పయనించింది’ అంటూ కవిత రూపంలో నివాళులర్పించింది. భార్య దివ్య ఇటీవల ఆత్మహత్య చేసుకోగా తట్టుకోలేక నేడు చంద్రశేఖర్ సూసైడ్ చేసుకున్నారు.

News March 21, 2026

మోదీనే అతిపెద్ద చొరబాటుదారుడు: సీఎం మమత

image

బెంగాల్ ఎన్నికల్లో అక్రమ వలసల అంశం బీజేపీకి ప్రచారాస్త్రంగా మారిన వేళ ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ దీనిపై కౌంటర్ ఇచ్చారు. బెంగాల్‌ను టార్గెట్ చేసేవారు నరకానికి వెళ్తారని.. ప్రధాని మోదీ, ఆయన ప్రభుత్వమే అతిపెద్ద చొరబాటుదారులని విమర్శించారు. కోల్‌కతాలోని ఈద్ ఈవెంట్‌‌లో ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా ఇప్పటికే SIRపైనా మమత విమర్శలు గుప్పించారు. BJP ప్రజల హక్కులను లాక్కోవాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

News March 21, 2026

7 కేజీల బరువు తగ్గా: శ్రేయస్

image

గాయం కారణంగా గతేడాది తనకు కష్టంగా గడిచిందని PBKS కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వెల్లడించారు. దాదాపు 7KGల బరువు తగ్గినట్లు తెలిపారు. గాయం నుంచి కోలుకొని మళ్లీ బరువు పెరిగి ఫిట్‌నెస్ సాధించడానికి తీవ్రంగా కష్టపడినట్లు గుర్తు చేసుకున్నారు. తనకు ఛాలెంజెస్ అంటే ఇష్టమన్నారు. ‘2025 IPLలో రన్నరప్‌గా నిలిచాం. ఈ ఏడాది మా జట్టుపై భారీ అంచనాలున్నాయి. నా కన్ను ట్రోఫీపైనే ఉంది’ అని పేర్కొన్నారు.