News August 20, 2025

PDPL: ‘సిపిఎస్ రద్దు.. ఓపిఎస్ పునరుద్ధరణకు డిమాండ్’

image

ప్రభుత్వ ఉపాధ్యాయుల యూనియన్ తెలంగాణ (PRTUTS) ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1న HYD ఇందిరాపార్కులో జరగనున్న మహాధర్నా పోస్టర్‌ను మండలశాఖ ఆవిష్కరించింది. CPS రద్దుచేసి పాతపెన్షన్ విధానం పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయులు, ఉద్యోగులు ధర్నాలో విస్తృతంగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గసిగంటి రమేష్, వెంగళం సత్యనారాయణతో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Similar News

News March 18, 2026

TGNPDCL అధికారుల డిప్యూటేషన్‌కు ఆదేశాలు

image

హనుమకొండ: TGNPDCL నుంచి TGRPDCLకు 12 మంది అధికారులను డిప్యూటేషన్‌పై పంపిస్తూ CMD కర్ణాటి వరుణ్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త డిస్కం ఏర్పాటుతో కార్యకలాపాల ప్రారంభం, ఆస్తులు-బాధ్యతల విభజన, నెట్‌వర్క్ పునర్వ్యవస్థీకరణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. అధికారులు తక్షణమే హాజరుకావాలని, డిప్యూటేషన్ గడువు ఒక సంవత్సరం అని తెలిపారు.

News March 18, 2026

విశాఖ: స్టీల్ ప్లాంట్‌‌లో 5 రోజుల వరకే గ్యాస్ నిల్వలు

image

విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ఎల్పీజీ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. పశ్చిమ ఆసియా యుద్ధంతో కేంద్రం ఆంక్షలు విధించి గృహ, ఆస్పత్రులకే ప్రాధాన్యం ఇచ్చింది. ప్లాంట్ ఉత్పత్తికి రోజుకు 12 టన్నుల గ్యాస్ అవసరముండగా కేవలం 5 రోజుల నిల్వలే మిగిలాయి. కటింగ్ పనులు, ఉత్పత్తి నిలిచే ప్రమాదం ఉంది. స్టీల్ బ్లూమ్స్‌ను బయట ప్రాసెసింగ్‌కు పంపడంతో ఖర్చులు పెరుగుతున్నాయి. కేటాయింపులు పెంచాలని నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

News March 18, 2026

కడప జిల్లాలో భారీగా ఆగిన నగదు చెల్లింపు

image

కడప జిల్లాలో మార్క్ ఫెడ్ ఈ నెల 17 నాటికి 3,143 మంది రైతుల నుంచి 13,078 మెట్రిక్ టన్నుల శనగలు కొనుగోలు చేసింది. క్వింటాలు రూ.5,875ల MSPతో రూ.76.83 కోట్ల శనగలను తీసుకుంది. ఇందుకు గాను ఇప్పటి వరకు కేవలం 89 మంది రైతులకు మాత్రమే పేమెంట్ జరిగింది. 385MTలకు సంబంధించి రూ.1.67 కోట్లు మాత్రమే రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఇంకా 3,054 మంది రైతులకు సంబంధించిన 12.693MTల శనగలకు రూ.75.16 కోట్లు చెల్లించాల్సిఉంది.