News August 20, 2025

GDK: పట్టణంలో ఘనంగా తీజ్ మాత ఉత్సవాలు

image

గోదావరిఖని పట్టణంలోని బొందిలి కులస్తులు తీజ్ మాత ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 9 రోజులపాటు వెదురు బుట్టలో ఎర్రటి మట్టి వేసి అందులో నవ ధాన్యాలు నాటి మొలకెత్తిన అనంతరం వాటిని ప్రత్యేకంగా పూజిస్తారు. మొక్కలు ఎంత పెరిగితే అంతా తమ కుటుంబం సుఖసంతోషాలతో ఉంటుందని విశ్వసిస్తారు. అనంతరం వాటిని గోదావరి నదిలో కలిపి, పెద్దవారి ఆశీర్వాదాలు తీసుకుంటారు. బొందిలి కులస్తులు పాల్గొన్నారు.

Similar News

News April 3, 2026

చరిత్ర సృష్టించిన ఆయుష్ మాత్రే

image

PBKSతో మ్యాచ్‌లో 43 బంతుల్లో 73 రన్స్ బాదిన ఆయుష్ మాత్రే(CSK) పలు రికార్డులను సొంతం చేసుకున్నారు. చెపాక్ స్టేడియంలో హాఫ్ సెంచరీ చేసిన పిన్న వయస్కుడి(18Y 261D)గా చరిత్ర సృష్టించారు. ఈ క్రమంలో సురేశ్ రైనా(21Y 148D) రికార్డును బ్రేక్ చేశారు. అలాగే IPLలో 19 ఏళ్లలోపే రెండు అర్ధశతకాలు చేసిన మూడో ప్లేయర్‌గా నిలిచారు. ఈ జాబితాలో వైభవ్(3), పృథ్వీ షా(2) ముందున్నారు.

News April 3, 2026

LPG గోడౌన్లను తనిఖీ చేసిన సివిల్ సప్లై అధికారులు

image

రంగారెడ్డి జోన్ అసిస్టెంట్ కంట్రోలర్ పి. రామకృష్ణ ఆధ్వర్యంలో శుక్రవారం మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలో పలుచోట్ల ఎల్పీజీ గోడౌన్లు, డీలర్ల వద్ద తనిఖీలు చేశారు. మేడ్చల్‌లో లీగల్ మెట్రాలజీ అధికారి సంజయ్ కృష్ణ, రంగారెడ్డి జిల్లాలో జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి ఎం. ప్రవీణ్ కుమార్ తనిఖీలు చేపట్టారు. నిబంధనలను ఉల్లంఘించిన ముగ్గురు డీలర్లపై కేసులు నమోదు చేశారు. సరైన తూకంతో సిలిండర్లను అందించాలని ఆదేశించారు.

News April 3, 2026

గిరిజన ఉత్పత్తుల తయారీ పరిశీలించిన శిక్షణ కలెక్టర్లు

image

భద్రాచలం ITDA పరిధిలో శిక్షణా డిప్యూటీ కలెక్టర్ల బృందం పర్యటించింది. గిరిజన మహిళలు తయారు చేస్తున్న సబ్బులు, షాంపూల తయారీ విధానాన్ని వారు అడిగి తెలుసుకున్నారు. అనంతరం జీసీసీ గోడౌన్లను సందర్శించి అటవీ ఉత్పత్తుల సేకరణపై వివరాలు సేకరించారు. భద్రగిరి మార్టులో ఇప్పపువ్వు లడ్డూలు, మిల్లెట్ బిస్కెట్లను కొనుగోలు చేసి, మహిళల నైపుణ్యాన్ని అభినందించారు. ఈ పర్యటనలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.