News August 20, 2025

VZM: ‘పరిసరరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి’

image

ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా వైద్యాధికారిణి జీవనరాణి సూచించారు. జిల్లా ఆరోగ్యశాఖ కార్యాలయంలో ప్రపంచ దోమల దినోత్సవాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్ రోనాల్డ్ రాస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మురుగునీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. డ్రై డే ఫ్రైడే తప్పనిసరిగా పాటించాలన్నారు.

Similar News

News September 26, 2025

చర్చలు సఫలం.. నిరసనను విరమించిన ఏయూ విద్యార్థులు

image

విద్యార్థి మణికంఠతో మృతితో ఏయూలో సమస్యలు పరిష్కరించాలంటూ చేస్తున్న నిరసనను విద్యార్థులు విరమించారు. హామీలు నెరవేరుస్తామని వీసీ, జిల్లా అధికార బృందం జరిపిన చర్చలు సఫలం కావడంతో విద్యార్థులు వెనక్కితగ్గారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం త్రీమెన్ కమిటీ నియమిస్తామన్నారు. DMHO, KGH సూపరింటెండెంట్, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ ఈ కమిటీ సభ్యులుగా ఉంటారు.

News September 26, 2025

విజయనగరం వ్యక్తికి 20 ఏళ్ల జైలు శిక్ష: ఎస్పీ

image

పొక్సో కేసులో పట్టణంలోని మేధరవీధికి చెందిన గ్రంధి పైడిరాజుకు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.3వేల జరిమానాను కోర్టు విధించిందని ఎస్పీ దామోదర్ తెలిపారు. 4ఏళ్ల బాలికను బైక్‌పై తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడని తల్లి ఫిర్యాదు మేరకు.. పోలీసులు ధర్యాప్తు చేపట్టి కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేశారన్నారు. నేరం రుజువు కావడంతో ఐదు నెలల్లోనే శిక్ష ఖరారైందన్నారు. బాదితురాలికి రూ.2లక్షల పరిహారం మంజూరైందన్నారు.

News September 25, 2025

VZM: రేపు మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ పర్యటన

image

రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌ పర్సన్‌ డాక్టర్ రాయపాటి శైలజ శుక్రవారం జిల్లాలో పర్యటించనున్నారని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ విమలారాణి గురువారం తెలిపారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగే ‘నవరాత్రి పోషణ్ మహా ప్రోగ్రాం’ కార్యక్రమంలో ఆమె పాల్గొంటారని పేర్కొన్నారు. అనంతరం వన్ స్టాప్ సెంటర్‌ను సందర్శించనున్నారని చెప్పారు.