News August 20, 2025
సీజనల్ వ్యాధులపై జాగ్రత్తలు తీసుకోవాలి: కామారెడ్డి కలెక్టర్

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిశ్ సాంగ్వాన్ బుధవారం తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని చిట్యాల ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌లో అందుతున్న సేవల గురించి గ్రామస్థులను అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలంలో వచ్చే వ్యాధులపై తగిన చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి సిబ్బందికి సూచించారు.
Similar News
News March 16, 2026
NLG: 22 నుంచి ఖాతాల్లోకి ‘భరోసా’.. పాస్ బుక్ ఉంటే చాలు..!

యాసంగి సాగుకు సంబంధించి ‘రైతు భరోసా’ నిధులను ఈ నెల 22 నుంచి పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో ఉమ్మడి జిల్లాలోని 10.50 లక్షల మంది రైతులకు భారీ ఊరట లభించనుంది. ప్రభుత్వం తొలుత సాగులో ఉన్న భూములకే సాయం అందించాలని భావించినా, రైతుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు నిర్ణయాన్ని మార్చుకుంది. ఇప్పుడు సాగులో ఉన్నా లేకున్నా, పట్టాదారు పాస్ బుక్ కలిగిన ప్రతి ఎకరాకు పెట్టుబడి సాయం అందనుంది.
News March 16, 2026
ఆసుపత్రిలో చేరిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్

TG రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ HYDలోని యశోద ఆసుపత్రిలో చేరారు. మంత్రి వైరల్ జ్వరం, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన వైద్యుల నిశిత పర్యవేక్షణలో ఉన్నారు. జ్వరం నుంచి పూర్తిగా కోలుకునేంత వరకు అడ్లూరి లక్ష్మణ్ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకారని తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో SC, ST సంక్షేమ కార్యక్రమాలను వివరించే బాధ్యతను మంత్రికి అప్పగించారు.
News March 16, 2026
అమెరికాలో వరంగల్ వాసి గుండెపోటుతో మృతి

అమెరికాలో స్థిరపడిన వరంగల్ జిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తాడిపత్రి రాకేష్ (40) గుండెపోటుతో మృతి చెందారు. వర్జీనియాలో వృత్తిరీత్యా స్థిరపడిన ఆయనకు ఆదివారం సాయంత్రం గుండెపోటు రావడంతో చనిపోయారు. రాకేష్‌కు 2014లో కరీంనగర్‌కు చెందిన తేజస్వినితో వివాహం జరిగింది, వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వరంగల్‌లోని ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.


