News April 1, 2024

శ్రీదేవిని ప్రతి క్షణం మిస్సవుతూనే ఉన్నా: బోనీ కపూర్ ఎమోషనల్

image

దివంగత శ్రీదేవిని తలుచుకుని భర్త, నిర్మాత బోనీ కపూర్ ఎమోషనల్ అయ్యారు. ‘మైదాన్’ మూవీ ప్రమోషన్లలో మాట్లాడుతూ.. ‘ఆమెను ఎప్పటికీ మర్చిపోలేను. ప్రతి క్షణం మిస్సవుతున్నా’ అని పేర్కొన్నారు. తన కుమార్తె జాన్వీకపూర్-శిఖర్ పహారియా రిలేషన్ గురించి స్పందిస్తూ.. ‘వారి వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడను. కొన్నాళ్లు వారి మధ్య మాటలు లేవు. ఇప్పుడు మళ్లీ కలిశారు. శిఖర్ అంటే నాకెంతో ఇష్టం’ అని పేర్కొన్నారు.

Similar News

News November 8, 2024

రోహిత్‌శర్మ నుంచి అది నేర్చుకున్నా: సూర్య

image

ఆటలో గెలుపోటములు సహజమని, ఓడినంత మాత్రాన మన మనస్తత్వం మార్చుకోవద్దని టీమ్ ఇండియా T20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ అన్నారు. ఆ విషయాన్ని రోహిత్‌శర్మను చూసే నేర్చుకున్నానని సూర్య చెప్పారు. రోహిత్ గ్రౌండ్‌లో ఎలా ఉంటారో తాను గమనిస్తూ ఉంటానన్నారు. అందరూ హార్డ్‌వర్క్ చేస్తారని, కొన్నిసార్లు కలిసొస్తే, కొన్నిసార్లు వర్కవుట్ కాదని సూర్య చెప్పుకొచ్చారు. రేపు సౌతాఫ్రికాతో T20 సిరీస్ ప్రారంభం కానుంది.

News November 8, 2024

నవంబర్ 8: చరిత్రలో ఈరోజు

image

* 1948: గాంధీని హత్య చేసినట్లు అంగీకరించిన గాడ్సే
* 2016: పాత రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన కేంద్రం
* 1656: తోకచుక్కను కనుగొన్న సైంటిస్ట్ ఎడ్మండ్ హేలీ జననం
* 1927: బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ పుట్టినరోజు
* 1969: సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు
* 1977: డైరెక్టర్ బీఎన్ రెడ్డి మరణం
* 2013: కమెడియన్ ఏవీఎస్ మరణం

News November 8, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.