News August 21, 2025
స్టీల్ ప్లాంట్లో ప్రమాదం.. కార్మికుడి మృతి

స్టీల్ ప్లాంట్ లోని ఎస్ఎంఎస్ విభాగంలో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఉద్యోగి మృతి చెందాడు. వడ్లపూడి ప్రాంతానికి చెందిన కర్రీ పైడి కొండయ్య ఎస్ఎంఎస్ విభాగంలోని టెక్నీషియన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. బుధవారం సాయంత్రం విభాగంలోని క్రేన్ పై పనులు చేస్తుండగా జారి పడి అక్కడికక్కడే మృతి చెందాడు. అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.
Similar News
News August 21, 2025
విశాఖ: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో మరో ముగ్గురు అరెస్ట్

ఆల్‌లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముగ్గురిని విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. విజయనగరం జిల్లాలో మెంటాడకు చెందిన బొడ్డు తిరుపతి (25), గొట్టాపు నాగేంద్రబాబు (25), రాపర్తి నాగేశ్వరరావు(25)ను అరెస్టు చేసి వారి నుంచి 3 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫోన్ల ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటి వరకు 8 మందిని అరెస్ట్ చేయగా.. బుధవారం ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు.
News August 21, 2025
భవనం ఖాళీ చేయించిన అధికారులు

విశాఖ వెలంపేట పూలవీధిలో ఒక భవనం మరో భవనంపై కుంగిపోయింది. ఈ విషయాన్ని ముందుగా ఒకరు నగర పోలీస్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన స్పందించి వెంటనే వన్ టౌన్ పోలీసులు, జీవీఎంసీ అధికారులను పంపించారు. పరిశీలన చేసిన వెంటనే ఆ భవనంలో ఉన్న పది కుటుంబాలను ఖాళీ చేయాలని సూచించారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ, ఇతర అధికారులు కూడా పరిశీలించారు. బిల్డర్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
News August 21, 2025
‘విశాఖలో అంతర్జాతీయ స్థాయి స్కేటింగ్ బోర్డు నిర్మాణం’

ఏషియన్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్‌లో పతకాలు సాధించిన స్కేటర్లను బుధవారం విశాఖలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గణబాబు, VMRDA ఛైర్మన్ ప్రణవ్ గోపాల్, మెట్రోపాలిటన్ కమిషనర్ విశ్వనాథన్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. రూ.3.50 కోట్లతో అంతర్జాతీయ స్థాయి స్కేటింగ్ బోర్డును విశాఖలో నిర్మిస్తున్నట్టు వెల్లడించారు.