News August 21, 2025
AP న్యూస్ రౌండప్

* కర్నూలు (D)లో <<17465047>>చిన్నారుల మృతి<<>> పట్ల CM చంద్రబాబు సంతాపం, జగన్ దిగ్భ్రాంతి
* విద్యాశాఖకు కేంద్రం అదనంగా రూ.432.19CR కేటాయింపు
* నిబంధనలు ఉల్లంఘించిన ఇద్దరు పీపీలు, 15మంది ఏపీపీలుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న లాయర్లపై ప్రభుత్వం వేటు
* PRC, డీఏలపై వెంటనే ప్రకటన చేయాలి: APNGO అధ్యక్షుడు విద్యాసాగర్
* అప్పులు తీరాక వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారు: బొత్స
Similar News
News August 21, 2025
ఇలా చేసి కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు!

రోజుకు కనీసం 2.5-3లీటర్ల నీటిని తాగితే కిడ్నీల ఆరోగ్యానికి మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ‘ఉప్పు, ప్రాసెస్డ్&ఆయిల్ ఫుడ్, మాంసాహారాన్ని పరిమితం చేయాలి. సాధ్యమైనంత వరకు పెయిన్ కిల్లర్స్ వాడకం తగ్గించాలి. వ్యాయామం, తగిన నిద్ర, మానసిక ప్రశాంతత అవసరం. మూత్ర విసర్జన ఆపుకోకూడదు. శరీర బరువు పెరిగితే బీపీ, షుగర్ వచ్చే అవకాశముంది. ఈ రెండూ కిడ్నీల డ్యామేజ్‌కు ప్రధాన కారణాలు’ అని చెబుతున్నారు. SHARE IT.
News August 21, 2025
PLEASE CHECK: అకౌంట్లలో డబ్బులు పడ్డాయా?

AP: ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ వల్ల ‘అన్నదాత సుఖీభవ’ లబ్ధి పొందని 1,04,107 మంది రైతుల ఖాతాల్లో నిన్న డబ్బులు జమ అయ్యాయి. వారితో పాటు ఈ-కేవైసీ, NPCI క్రమబద్ధీకరించుకున్న మరో 38,658 మందికి రూ.5వేల చొప్పున మంత్రి అచ్చెన్నాయుడు రూ.71.38 కోట్లు విడుదల చేశారు. ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయో? లేదో? ఈ <
News August 21, 2025
ఆన్‌లైన్ గేమ్స్‌తో రూ.20 వేల కోట్లు గుల్ల!

మన దేశంలో ఏటా ప్రజలు ఆన్‌లైన్ గేమ్స్ ఆడి రూ.20,000 కోట్లు పోగొట్టుకుంటున్నట్లు సమాచారం. యాప్‌లు, వెబ్‌సైట్లకు యువత బానిసగా మారుతోంది. కొన్ని రాష్ట్రాల్లో నిషేధం ఉన్నా ఫేక్ లొకేషన్లతో ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతున్నారు. బెట్టింగ్‌లో డబ్బు పోగొట్టుకున్నవారు అడ్డదారులు తొక్కుతున్నారు. దోపిడీ, దొంగతనాలతోపాటు సిగరెట్లు, మద్యం, డ్రగ్స్‌కు కూడా అలవాటు పడుతున్నారు. డబ్బుల కోసం తల్లిదండ్రులను పీడిస్తున్నారు.