News August 21, 2025
ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకి దరఖాస్తు చేస్కోండి: DEO

సెప్టెంబర్ 5న గురుపూజోత్సవాన్ని పురస్కరించుకొని ఉత్తమ ఉపాధ్యాయఅవార్డులకు అర్హులైన ప్రభుత్వ ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవాలని డీఈవో సి.వి రేణుక ఒక ప్రకటనలో తెలిపారు. కనీసం పదేళ్ల సర్వీస్, నేరారోపణ అభియోగాలు లేని వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని చెప్పారు. deo guntur blogspot.com.websiteలో నమూనా దరఖాస్తులు ఉన్నాయని, పూర్తి చేసిన దరఖాస్తులు ఈ నెల 26లోపు డీఈవో కార్యాలయానికి పంపించాలని సూచించారు.
Similar News
News September 7, 2025
సంగీత దర్శకుడు BNR మన కొలకలూరు వారే

తెలుగు సినిమా సంగీత దర్శకులు భీమవరపు నరసింహరావు (బి.ఎన్.ఆర్.) గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని కొలకలూరులో జన్మించారు. జనవరి 24, 1905న జన్మించిన ఆయనకు 8 ఏళ్ల వయసు నుంచే సంగీతంపై ఆసక్తి కలిగింది. ఆయన మొదటి సినిమా సతీ తులసి (1936), ఆఖరి చిత్రం అర్ధాంగి (1955). సెప్టెంబర్ 7, 1976న ఆయన మరణించారు. ఆయన తెలుగు సినిమా సంగీతానికి ఎనలేని సేవలు అందించారు.
News September 7, 2025
GNT: ఎన్జీరంగా వ్యవసాయ వర్సిటీకి 31వ ర్యాంకు

కేంద్ర విద్యాశాఖ జాతీయ సంస్థల ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (NIRF) ప్రకటించిన ర్యాంకుల్లో ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 31వ స్థానానికి పడిపోయింది. 2024లో 26వ ర్యాంకు సాధించిన ఈ యూనివర్సిటీ పాలకమండలి లేకపోవడం, శాస్త్రవేత్తల పోస్టుల భర్తీ లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో యూనివర్సిటీ ప్రతిష్ఠకు గండి పడిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
News September 7, 2025
గుంటూరులో నేడు చికెన్ ఎంతంటే?

గుంటూరులో ఆదివారం చికెన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. స్కిన్ లెస్ కేజీ రూ.240, స్కిన్‌తో అయితే రూ.220కి లభిస్తోంది. కొన్ని చోట్ల డిమాండ్‌ను బట్టి ధరల్లో స్వల్ప మార్పులున్నాయి. మటన్ ధర యథావిధిగా రూ.950 – 1020 మధ్య కొనసాగుతుంది. చేపల్లో బొచ్చ రూ.200, రాగండి రూ.180గా విక్రయిస్తున్నారు. మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.