News August 21, 2025

మల్యాల: కుమారుడితో పాటు, వివాహిత మిస్సింగ్

image

మల్యాలకు చెందిన అలకుంట పూజ(21) మంగళవారం అర్ధరాత్రి నుంచి కనిపించకుండా పోయినట్లు ఎస్సై నరేష్ తెలిపారు. గత రెండేళ్ల క్రితం వడ్డపల్లి గ్రామానికి చెందిన చందుతో వివాహం కాగా, మనస్పర్ధలతో తల్లిదండ్రుల వద్ద ఉంటుంది. ఈ క్రమంలో ఇంట్లో ఎవరికి చెప్పకుండా తన 2 ఏళ్ళ బాబుతో వెళ్లగా, చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో ఆమె తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

Similar News

News March 6, 2026

శ్రీకాకుళంలో ఆ అద్భుత ఘట్టానికి వేళాయే

image

శ్రీకాకుళం ప్రత్యక్షదైవం ఆరోగ్యప్రదాత అరసవల్లి ఆదిత్యుని మూలవిరాటుపై తొలి సూర్యకిరణాలు స్పృశించే అద్భుత ఘట్టం ఈ నెల 9, 10 తేదీల్లో ఆవిష్కృతం కానుంది. ఈ విషయాన్ని ఆలయ ప్రధాన అర్చకులు శంకర శర్మ, ఆలయ ఈవో K.N.V.D.V ప్రసాద్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉత్తరాయణ, దక్షిణాయణ కాలమార్పుల్లో భాగంగా ఆలయ గర్భాలయంలో కొలువైన ఆదిత్యుని పాదాలపై నేరుగా తొలి సూర్యకిరణాలు తాకనున్నాయి.

News March 6, 2026

TODAY HEADLINES

image

* ఏ వివాదానికైనా సైనిక చర్య పరిష్కారం కాదు: PM
* BJP చేతికి బిహార్ పగ్గాలు.. RSకు నితీశ్
* WB గవర్నర్ బోస్, లద్దాక్ LG కవీందర్ రిజైన్
* ఇద్దరు, ఆపై సంతానానికి రూ.25,000: CBN
* జగన్‌కు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వబోం: అయ్యన్న
* కొత్త జిల్లాల ప్రాతిపదికన జడ్పీ ఎన్నికలు: పవన్
* TG: రాజ్యసభకు సింఘ్వీ, నరేందర్ నామినేషన్
* TG: HYDలో రేవంత్ ఒక్క ఇల్లూ కట్టలేదు: KTR
* T20WC.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్

News March 6, 2026

తెలంగాణ కొత్త గవర్నర్ శుక్లా నేపథ్యం ఇదే

image

తెలంగాణ గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్లా నియమితులయ్యారు. ఈయన 1952లో గోరఖ్‌పూర్‌(UP)లో జన్మించారు. 1983లో BJPలో చేరారు. 1989, 91, 93, 96లో గోరఖ్‌పూర్ నియోజకవర్గం నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2016-2022 వరకు ఉత్తర్ ప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 2017-19 వరకు నరేంద్ర మోదీ క్యాబినెట్‌లో ఆర్థికశాఖ సహాయమంత్రిగా పని చేశారు. 2023 నుంచి ఇప్పటివరకు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా ఉన్నారు.