News August 21, 2025
శ్రీకాకుళం జిల్లా పశువైద్యాధికారికి రాష్ట్ర స్థాయి పురస్కారం

మూగజీవాల వైద్య సేవలో విశేష సేవలందించినందుకు శ్రీకాకుళం జిల్లాకు చెందిన డా. లిఖినేని కిరణ్ కుమార్ రాష్ట్ర స్థాయిలో ఉత్తమ పశువైద్యాధికారి పురస్కారం అందుకున్నారు. బుధవారం విజయవాడలోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో డైరెక్టర్ దామోదర్ నాయుడు ఆయనకు ఈ అవార్డును శాలువాతో సన్మానించి బహుకరించారు. పశువైద్య రంగంలో చేసిన కృషికి మరింత గుర్తింపు లభిస్తుందని అధికారులు అభినందించారు.
Similar News
News August 21, 2025
టెక్కలి: సెప్టెంబర్ 1 నుండి డిగ్రీ తరగతులు ప్రారంభం!

ఎట్టకేలకు డిగ్రీ ఫస్టియర్ కోర్సులకు నోటిఫికేషన్ జారీ అయింది. ఈనెల 20 నుండి 26 వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ, వెబ్ ఆప్షన్స్ కొరకు 24 నుండి 28 లో తేదీ వరకు, సీట్ల కేటాయింపు 31 వ తేదీన ఉంటుంది. సెప్టెంబర్ 1 వ తేదీ నుండి ప్రథమ సంవత్సరం తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈమేరకు జిల్లాలో ఉన్న 15 ప్రభుత్వ, 74 ప్రైవేట్ కాలేజీలకు ఆదేశాలు రావడంతో ప్రవేశాలపై ప్రిన్సిపాళ్ళు, సిబ్బంది దృష్టి సారిస్తున్నారు
News August 21, 2025
పైడిభీమవరంలో బాలికతో అసభ్య ప్రవర్తన: ఎస్సై

రణస్థలం (M) పైడిభీమవరానికి చెందిన 9వ తరగతి బాలికతో ఇప్పిలి సతీశ్ అసభ్యకరంగా ప్రవర్తించడంతో J.R.పురం పోలీసులు కేసు నమోదు చేశారు. బాలిక మంగళవారం రాత్రి ఇంటి వద్ద ఉన్న సమయంలో కనిమెట్టకు చెందిన సతీశ్ మద్యంతాగి అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె కేకలు వేయడంతో స్థానికులు అతడికి దేహశుద్ధి చేశారు. ఈ ఘటనపై ఎస్సై చిరంజీవి పోక్సో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
News August 20, 2025
జలుమూరు: ఉపరాష్ట్రపతి పోటీలో నాయుడు గారి రాజశేఖర్ నామినేషన్ ఆమోదం

భారత ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేసిన నాయుడు గారి రాజశేఖర్ నామినేషన్ బుధవారం రాజ్యసభ ఎన్నికల అధికారి ఆమోదించారు. నామినేషన్ అనుమతి పత్రం అందుకున్నట్లు రాజశేఖర్ తెలిపారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తాను పోటీ చేసే ప్రధాన కారణం తన గ్రామాన్ని ఢిల్లీ స్థాయిలో గుర్తింపు తీసుకురావడమేనని చెప్పారు. దక్షిణకాశీగా పేరుగాంచిన పవిత్ర శ్రీముఖలింగ క్షేత్ర అభివృద్ధి కోసం కృషి చేస్తానని రాజశేఖర్ స్పష్టం చేశారు.