News August 21, 2025

పెద్దపల్లి: మూడు రోజులపాటు ఆధార్ సవరణ క్యాంపులు

image

ఆగస్టు 21 నుంచి 23 వరకు ప్రతి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయాలు, పెద్దపల్లి, రామగుండం మున్సిపల్ కార్యాలయాలలో ఆధార్ సవరణ క్యాంపులు ఏర్పాటు చేయనున్నట్లు PDPL కలెక్టర్ కోయ శ్రీహర్ష ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఆధార్ వివరాలు సరిచేసుకోవాలని ఆయన సూచించారు. ముఖ్యంగా అంగన్వాడీ లబ్ధిదారులు ఆధార్ అప్డేట్ చేసుకుని పోషణ్ ట్రాకర్ FRSలో 100% నమోదు పూర్తి చేయాలని కలెక్టర్ కోరారు.

Similar News

News March 17, 2026

రెవెన్యూ క్లినిక్‌లతో భూసమస్యల పరిష్కారం: కలెక్టర్

image

రాష్ట్ర ప్రభుత్వం భూసమస్యలపై ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ క్లినిక్స్ లు ఉత్తమ ఫలితాలు నిస్తున్నాయని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. భీమవరం కలెక్టరేట్లో జరిగిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ..29 డిసెంబర్, 2025న రెవెన్యూ క్లినిక్‌లు ప్రారంభం నాటి నుంచి మార్చి 16, 2026 వరకు 10 విడతలుగా రెవెన్యూ క్లినిక్‌లను నిర్వహించడం జరిగిందని తెలిపారు. మొత్తం 461 దరఖాస్తులు అందగా 148 పరిష్కరించామన్నారు.

News March 17, 2026

జహీరాబాద్: స్కూటీ డిక్కీ నుంచి రూ.8 లక్షలు కొట్టేశారు

image

జహీరాబాద్ తహశీల్దార్ ఆఫీస్ వద్ద మంగళవారం స్కూటీ డిక్కీ నుంచి క్షణాల్లో రూ.8లక్షలు కొట్టేశారు. బాధితుడు నరసింహారెడ్డి భూమి రిజిస్ట్రేషన్ కోసం ఎస్‌బీఐ బ్రాంచ్ నుంచి రూ. 8 లక్షలు డ్రా చేసి స్కూటీ డిక్కీలో పెట్టుకొని కార్యాలయం లోపలికి వెళ్లారు. తిరిగి వచ్చేసరికి దుండగులు నగదును దోచుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బ్యాంకు నుంచి దుండగులు వెంబడించి ఉంటారని అనుమానిస్తున్నారు.

News March 17, 2026

ప్రచార రథాన్ని ప్రారంభించిన నల్గొండ కలెక్టర్

image

“ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన” పథకం కింద జిల్లాలో ఎక్కువ మంది లబ్ధిదారులు వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం ఆయన “ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలి యోజన” పథకంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఉద్దేశించి ఏర్పాటుచేసిన ప్రచార రథాన్ని కలెక్టర్ కార్యాలయం వద్ద ఆయన మంగళవారం ప్రారంభించారు.