News April 1, 2024

SHOCKING: ఆటో బుక్ చేస్తే రూ. కోటి బిల్ వచ్చింది!

image

నోయిడాలో ఓ వ్యక్తి ఉబర్ ఆటో బుక్ చేయగా రూ.7 కోట్ల బిల్‌ వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తికి సైతం బెంగళూరులో ఇలాంటి అనుభవమే ఎదురైంది. అతను ఉబర్ ఆటో బుక్ చేయగా బిల్ రూ.250 వస్తుందనుకుంటే ఏకంగా రూ. కోటి వచ్చేసరికి షాక్ అయ్యాడు. అయితే, ఇది సాంకేతిక లోపం వల్ల జరిగినప్పటికీ డ్రైవర్‌తో పాటు తననూ ఆందోళనకు గురిచేసిందని సదరు వ్యక్తి సోషల్ మీడియాలో మొరపెట్టుకున్నాడు.

Similar News

News March 24, 2026

IPL: రహానేకు అతి తక్కువ జీతం..

image

IPL- 2026లో జీతాల పరంగా కెప్టెన్ల మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. LSG కెప్టెన్ పంత్ ₹27 కోట్లతో అత్యధిక జీతం తీసుకుంటున్న ఆటగాడిగా రికార్డు సృష్టించారు. మరోవైపు KKR కెప్టెన్ అజింక్యా రహానే ₹1.5 కోట్లు మాత్రమే అందుకుంటున్నారు. ఈ సీజన్‌లో అత్యంత తక్కువ జీతం తీసుకుంటున్న సారథి ఈయనే. కాస్ట్లీ ప్లేయర్ల కంటే అనుభవానికే KKR ప్రాధాన్యం ఇవ్వగా.. ఈ ‘లో బడ్జెట్’ కెప్టెన్ ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.

News March 24, 2026

అమరావతి అగ్ని ప్రమాదాల వెనుక కుట్ర కోణం: CBN

image

AP: అమరావతిలో అగ్నిప్రమాదాలపై నిగ్గు తేల్చాలని CM చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ‘కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత జరుగుతున్న అగ్నిప్రమాద ఘటనలు నిజంగా ప్రమాదాలా, లేక వాటి వెనుక కుట్ర కోణం ఉందా అనేది వెలికి తీయాలి. వరుస ఘటనలు, అవి జరుగుతున్న తీరు చూస్తుంటే కుట్ర ఉందనే అనుమానం వస్తోంది’ అని పేర్కొన్నారు. రాజధానిలో నిర్మాణ పనులకు ఆటంకం కలగకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని సూచించారు.

News March 24, 2026

ALERT: పెట్రోల్ కొట్టిస్తున్నారా?

image

బంకుల్లో ఇంధనం కొట్టిస్తున్నప్పుడు చాలా మంది రీడింగ్ సున్నా ఉందో చెక్ చేస్తుంటారు. అయితే ఇంధన డెన్సిటీ చెక్ చేయడం ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. పెట్రోల్ డెన్సిటీ 720 – 775kg/m³, డీజిల్ 820 – 860kg/m³ మధ్య ఉండాలి. ఇది తక్కువగా ఉంటే ఇంధనంలో కల్తీ జరిగినట్లు అర్థం. ఈ ఇంధనం మైలేజీని తగ్గించడమే కాకుండా ఇంజిన్‌ను దెబ్బతీస్తుంది. అందుకే తప్పనిసరిగా ‘Density’ డిస్‌ప్లేలో చెక్ చేయండి. share it