News August 21, 2025

ములుగు: ఏటూరునాగారంలో రెండవ ప్రమాద హెచ్చరిక

image

ఏటూరునాగారం మండలం రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశామని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. జిల్లాలో 8 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి 75 కుటుంబాలకు చెందిన 216 మందిని తరలించామని పేర్కొన్నారు. నదీ తీర ప్రాంతాలకు వెళ్లరాదని, వరద నీటిలో ప్రయాణాలు చేయోద్దని ఆయన సూచించారు.

Similar News

News March 7, 2026

సర్వైకల్ క్యాన్సర్ నివారణకు HPV టీకా డ్రైవ్

image

జిల్లాలో సర్వైకల్ క్యాన్సర్ నివారణ లక్ష్యంగా HPV వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి తెలిపారు. 14 ఏళ్లు నిండి 15వ ఏట అడుగుపెట్టే బాలికలకు ‘గార్డాసిల్-4’ టీకా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో ఉంటుందని చెప్పారు. జిల్లాలో 19,704 మంది బాలికలను లక్ష్యంగా తీసుకుని ఈ కార్యక్రమం మూడు నెలలు కొనసాగుతుందని వెల్లడించారు.

News March 7, 2026

మధ్యవర్తిత్వానికి ముందుకొస్తున్నారు.. కానీ: ఇరాన్ అధ్యక్షుడు

image

మిడిల్ఈస్ట్‌లో ఉద్రిక్తతల నేపథ్యంలో కొన్ని దేశాలు మధ్యవర్తిత్వానికి ముందుకొస్తున్నాయని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజ్‌కియాన్ వెల్లడించారు. తాము శాంతికి కట్టుబడి ఉన్నామని.. కానీ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు వెనుకాడబోమన్నారు. మధ్యవర్తిత్వం వహించాలనుకుంటున్న దేశాలు యుద్ధం ప్రారంభించిన దేశాలపై దృష్టిసారించాలని సూచించారు. దీంతో అమెరికా, ఇజ్రాయెల్ తగ్గితే కానీ తాము తగ్గబోమని హింట్ ఇచ్చారు.

News March 7, 2026

‘బ్లూ స్పారో’తోనే ఖమేనీ మృతి!

image

ఇరాన్ సుప్రీంలీడర్ ఖమేనీని చంపడానికి ఇజ్రాయెల్ ‘బ్లూ స్పారో’ మిస్సైల్‌ను ప్రయోగించినట్లు తెలుస్తోంది. ఇది 1900 కిలోల బరువు ఉంటుంది. సాధారణంగా మిస్సైళ్లు టార్గెట్స్ చేరేందుకు ఓ నిర్దిష్టమైన యాంగిల్‌లో ప్రయాణిస్తాయి. కానీ ఈ బ్లూ స్పారో ముందు దాదాపు అంతరిక్షానికి చేరి ఆపై నిటారుగా శబ్దం కంటే ఎన్నోరెట్లు వేగంతో లక్ష్యంవైపు దూసుకొస్తుంది. డిఫెన్స్ సిస్టమ్స్ కనిపెట్టేలోపే చేయాల్సిన నష్టం చేసేస్తుంది.