News August 21, 2025
గండికోట: లై డిటెక్టర్ టెస్ట్‌కు బాలిక కుటుంబసభ్యులు?

జూలై 14న గండికోటలో బాలిక హత్య కేసు మిస్టరీగా మారింది. డీఐజీ కోయ ప్రవీణ్, ఎస్పీ అశోక్ కుమార్ పర్యవేక్షణలో కేసు విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే బాలిక తల్లిదండ్రులతో పాటు దాదాపు 400 మందిని విచారించారు. కాగా ఈ నెల 26న లై డిటెక్టర్ టెస్ట్ కోసం జమ్మలమడుగు కోర్టుకు రావాలని బుధవారం సాయంత్రం బాలిక కుటుంబసభ్యులకు పోలీసులు నోటీసులు ఇచ్చినట్లు సమాచారం.
Similar News
News August 21, 2025
కృష్ణా: ఆ ఎరువులు మాకొద్దు బాబోయ్!

ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎరువుల కొరత ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాకు లక్ష మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం కాగా, కేవలం 65 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అందులో 25 శాతం ద్రవ రూపంలో ఉన్న నానో యూరియా. అయితే నానో యూరియా వల్ల పంటకు బలం చేకూరదని రైతులు వాపోతున్నారు. బయట మార్కెట్‌లో రూ.400-450కి ఎరువులు అమ్ముతున్నారని, బిల్లులు కూడా ఇవ్వడం లేదని రైతులు చెబుతున్నారు.
News August 21, 2025
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తోన్న బంగారం ధరలు ఇవాళ కాస్త పెరిగాయి. HYD బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములపై రూ.600 పెరిగి రూ.1,00,750కు చేరింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములపై రూ.500 ఎగబాకి రూ.92,300 పలుకుతోంది. అటు KG వెండిపై రూ.1,000 పెరిగి రూ.1,26,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News August 21, 2025
కృష్ణా: జిల్లాల పేర్ల మార్పుపై ఉత్కంఠ

జిల్లాల పునర్విభజనపై ఏపీ కేబినెట్ సబ్ కమిటీ ఈరోజు సమావేశం కానుంది. ఇందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లాను విజయవాడగా మార్చి, కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నూజివీడు, గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లాలో, కైకలూరును కృష్ణాలో, నందిగామ, జగ్గయ్యపేటలను అమరావతి జిల్లాలో విలీనం చేయనున్నట్లు సమాచారం.