News August 21, 2025
కామారెడ్డి: అడవిలో మహిళ మృతదేహం కలకలం

కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం రాంపల్లి గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో మహిళ మృతదేహం లభ్యమైనట్లు ఎస్ఐ దీపక్ కుమార్ బుధవారం తెలిపారు. మండల కేంద్రానికి చెందిన చిన్నక్క(41) 15 రోజుల క్రితం అదృశ్యమైనట్లు కేసు నమోదు చేశామని, అటవీ ప్రాంతంలో లభ్యమైన మృతదేహం ఆమెదేనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.
Similar News
News August 21, 2025
విజయనగరంలో పేకాట రాయుళ్లు అరెస్ట్: సీఐ

విజయనగరం శుద్ధ వీధిలోని ఓ ఇంటిలో పేకాట ఆడుతున్న ఏడుగురిని అరెస్టు చేసినట్లు టూ టౌన్ సీఐ టి.శ్రీనివాసరావు బుధవారం తెలిపారు. ఎస్.బంగారునాయుడు ఇంట్లో పేకాట ఆడుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు సిబ్బందితో కలిసి దాడి చేశామన్నారు. రూ.48,810 నగదు, 8 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని ఏడుగురిపై కేసు నమోదు చేశామన్నారు. కాగా వీరిలో పలువురు వైసీపీ నేతలు ఉన్నట్లు సమాచారం.
News August 21, 2025
స్టీల్ ప్లాంట్‌లో ప్రైవేట్ క్యాంటీన్లు మూసివేత

స్టీల్ ప్లాంట్‌లో 78 ప్రైవేట్ క్యాంటీన్లు మూసివేస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఒక్కసారిగా యాజమాన్యం తీసుకున్న నిర్ణయంతో దాదాపు 510 మంది ఉపాధి కోల్పోగా లక్షల రూపాయలు నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. క్యాంటీన్లో పనిచేసిన కార్మికులకు సైతం పాసులు రద్దు చేయడంతో లోపలికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. సామాన్లు తెచ్చుకోలేదని లోపలికి అనుమతించాలని క్యాంటీన్ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
News August 21, 2025
ఒకే కుటుంబంలో ఐదుగురు అనుమానాస్పద మృతి!

TG: హైదరాబాద్‌లో తీవ్ర విషాదం నెలకొంది. మియాపూర్‌లోని ఓ ఇంట్లో అనుమానాస్పద స్థితిలో ఐదు మృతదేహాలను గుర్తించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా స్థానికులు వెల్లడించారు. ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుల్లో అత్త, మామ, భార్య, భర్త, రెండేళ్ల చిన్నారి ఉన్నారని ప్రాథమికంగా గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.