News August 21, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
Similar News
News August 21, 2025
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తోన్న బంగారం ధరలు ఇవాళ కాస్త పెరిగాయి. HYD బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములపై రూ.600 పెరిగి రూ.1,00,750కు చేరింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములపై రూ.500 ఎగబాకి రూ.92,300 పలుకుతోంది. అటు KG వెండిపై రూ.1,000 పెరిగి రూ.1,26,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News August 21, 2025
నేపాల్ వాదనను ఖండించిన భారత్

భారత సరిహద్దులో ఉన్న లింపియాధుర, లిపులేఖ్, కాలాపాణిలు తమ ప్రాంతాలేనన్న నేపాల్ వాదనను భారత్ ఖండించింది. ‘లిపులేఖ్ ద్వారా IND-CHINA మధ్య 1953లోనే వాణిజ్యం మొదలైంది. తర్వాత కొన్ని కారణాలతో నిలిచిపోయింది. ఇప్పుడు దాన్ని మళ్లీ ప్రారంభించాలని ఇరుదేశాలూ నిర్ణయించాయి. దీనిపై నేపాల్ అభ్యంతరం చెప్పడం సరికాదు’ అని పేర్కొంది. కాగా IND-CHI వివాదాలు పక్కనబెట్టి వాణిజ్య సంబంధాలను పునరుద్ధరించుకుంటున్నాయి.
News August 21, 2025
రూ.85 వేల జీతంలో 750 బ్యాంక్ ఉద్యోగాలు

పంజాబ్&సింధ్ బ్యాంక్ 750 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఏపీలో 80, తెలంగాణలో 50 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏదైనా డిగ్రీ చదివి వయసు 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు వయసు సడలింపు ఉంటుంది. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.48,480 నుంచి రూ.85,920 వరకు ఉంటుంది. సెప్టెంబర్ 4లోగా <