News August 21, 2025

ఆగస్టు 21: చరిత్రలో ఈ రోజు

image

1914: సంగీత దర్శకుడు పి.ఆదినారాయణరావు జననం
1963: నటి రాధిక జననం
1978: భారత మాజీ క్రికెటర్ వినూ మన్కడ్ మరణం
1978: నటి భూమిక చావ్లా జననం
1986: జమైకన్ అథ్లెట్ ఉసేన్ బోల్ట్ జననం
1998: హీరోయిన్ డింపుల్ హయాతి జననం
2013: ‘సాహిత్య అకాడమీ’ గ్రహీత మాలతీ చందూర్ మరణం
* జాతీయ వృద్ధుల దినోత్సవం

Similar News

News August 21, 2025

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

image

గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తోన్న బంగారం ధరలు ఇవాళ కాస్త పెరిగాయి. HYD బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములపై రూ.600 పెరిగి రూ.1,00,750కు చేరింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములపై రూ.500 ఎగబాకి రూ.92,300 పలుకుతోంది. అటు KG వెండిపై రూ.1,000 పెరిగి రూ.1,26,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News August 21, 2025

నేపాల్‌ వాదనను ఖండించిన భారత్

image

భారత సరిహద్దులో ఉన్న లింపియాధుర, లిపులేఖ్, కాలాపాణిలు తమ ప్రాంతాలేనన్న నేపాల్ వాదనను భారత్ ఖండించింది. ‘లిపులేఖ్ ద్వారా IND-CHINA మధ్య 1953లోనే వాణిజ్యం మొదలైంది. తర్వాత కొన్ని కారణాలతో నిలిచిపోయింది. ఇప్పుడు దాన్ని మళ్లీ ప్రారంభించాలని ఇరుదేశాలూ నిర్ణయించాయి. దీనిపై నేపాల్ అభ్యంతరం చెప్పడం సరికాదు’ అని పేర్కొంది. కాగా IND-CHI వివాదాలు పక్కనబెట్టి వాణిజ్య సంబంధాలను పునరుద్ధరించుకుంటున్నాయి.

News August 21, 2025

రూ.85 వేల జీతంలో 750 బ్యాంక్ ఉద్యోగాలు

image

పంజాబ్&సింధ్ బ్యాంక్ 750 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఏపీలో 80, తెలంగాణలో 50 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏదైనా డిగ్రీ చదివి వయసు 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు వయసు సడలింపు ఉంటుంది. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.48,480 నుంచి రూ.85,920 వరకు ఉంటుంది. సెప్టెంబర్ 4లోగా <>punjabandsindbank.co.in<<>> సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. SHARE IT.