News August 21, 2025
కొత్తగూడెం: ‘మార్వాడీలు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు’

కొత్తగూడెంలో బుధవారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు బొమ్మెర శ్రీనివాస్ మాట్లాడారు. తెలంగాణలో మార్వాడీలు ఏకమై స్థానిక వ్యాపారాలను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. వ్యాపారం కోసం వచ్చిన మార్వాడీలు రాష్ట్ర సంపదను దోచుకుంటున్నారని, ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తున్నారన్నారు. పలు చోట్ల ఉన్న ‘మార్వాడీ గో బ్యాక్’ నినాదం నేడు కొత్తగూడెంకు పాకడం గమనార్హం.
Similar News
News August 21, 2025
SRSP వరద గేట్లను మూసేసిన అధికారులు

శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద నీరు తగ్గడంతో గురువారం వరద గేట్లను మూసివేశారు. సోమవారం 40 గేట్లు ఓపెన్ చేసిన అధికారులు నిన్నటి నుంచి క్రమక్రమంగా అన్ని గేట్లను మూసివేశారు. కాగా ఉదయం 10.30 గంటలకు ఎగువ నుంచి ప్రాజెక్టుకు ఇన్ ఫ్లోగా 1.20 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. ఇక ప్రాజెక్టులో తాజాగా 1089.60 అడుగుల (75.314TMC) నీటి మట్టం ఉన్నట్లు అధికారులు వివరించారు.
News August 21, 2025
రాజ్యాంగ సవరణ బిల్లుపై కాంగ్రెస్‌కు బాధ ఎందుకు: కిషన్ రెడ్డి

TG: నిన్న లోక్‌సభలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ <<17462620>>బిల్లును<<>> దేశమంతా స్వాగతిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ బిల్లు అన్ని పార్టీలకు వర్తించేలా ఉందని అభిప్రాయపడ్డారు. అయితే కాంగ్రెస్ ఎందుకు బాధ పడుతుందో అర్థం కావడం లేదన్నారు. బిల్లు విషయంలో INDI కూటమి వ్యవహరిస్తున్న తీరు దురదృష్టకరమని అన్నారు. రాజకీయాల్లో ఆరోపణలు వచ్చినప్పుడు స్వచ్ఛందంగా పదవి నుంచి వైదొలగాలన్నారు.
News August 21, 2025
వనపర్తి: ఆసుపత్రికి వెళ్లి.. అంతలోనే మృతి ఒడిలోకి

ఆరోగ్యం బాగోలేదని ఆసుపత్రికి వెళ్లిన ఓ వ్యక్తి అంతలోనే మృతి చెందిన ఘటన గోపాల్పేట్ మండలంలో జరిగింది. SI నరేష్ కుమార్ తెలిపిన వివరాలు.. ఏదుట్లకి చెందిన JCB డ్రైవర్ గొట్టిముక్కుల మహేష్(36) కాళ్లు, చేతులు లాగుతున్నాయని భార్యతో చెప్పగా ఆమె RMP డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లింది. బీపీ చెక్ చేస్తుండగా ఒక్కసారిగా కిందపడ్డాడు. WNP ఆస్పత్రికి తరలించగా మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు.