News August 21, 2025
శ్రీశైలం ఘటనపై పవన్ కళ్యాణ్ సీరియస్

AP: శ్రీశైలం ఫారెస్ట్ అధికారులపై దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయాలని Dy.CM పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఈ ఘటనపై సవివరంగా నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులకు సూచించారు. ‘తాము తప్పు చేసినా ఉపేక్షించొద్దని చంద్రబాబు, నేను అసెంబ్లీలో స్పష్టం చేశాం. ప్రజా జీవితంలో ఉన్నవారు తమను తాము నియంత్రించుకోవాలి. ఉద్యోగుల విధి నిర్వహణను ఆటంకం కలిగించేవారు ఏ స్థాయిలో ఉన్నా ఉపేక్షించొద్దు’ అని ఆయన ట్వీట్ చేశారు.
Similar News
News August 21, 2025
ఓట్ చోరీని మరిపించేందుకు బీజేపీ కొత్త ప్లాన్: CM స్టాలిన్

ఓట్ చోరీ బయటపడటంతోనే దాని నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు బీజేపీ 130వ రాజ్యాంగ సవరణ బిల్లును తెరపైకి తెచ్చిందని తమిళనాడు సీఎం స్టాలిన్ ఆరోపించారు. కక్ష సాధింపులో భాగంగా దీన్ని రాజకీయ ప్రత్యర్థులపై సంధిస్తుందని మండిపడ్డారు. ‘30 రోజులు అరెస్ట్ చేసి.. ఎలాంటి విచారణ, తీర్పు లేకుండా ఒక సీఎంను అరెస్ట్ చేస్తారా? ఇది బీజేపీ డిక్టేటర్‌షిప్ మాత్రమే’ అని స్టాలిన్ విమర్శించారు.
News August 21, 2025
పక్కనోళ్లపై నీళ్లు పడతాయి.. కాస్త చూసి వెళ్లు బ్రో

వర్షాలు కురుస్తుండటంతో చాలా చోట్ల రోడ్డుపై నీరు నిలిచిపోయింది. అందులో నుంచి వేగంగా వాహనాలు వెళ్లడంతో బైకర్లు, పాదచారులపై ఆ వరద నీరు పడి ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఉదయంపూట ఆఫీసులకు, స్కూళ్లకు, ఇంటర్వ్యూలకు వెళ్లేవారు చాలా మంది ఉంటారు. అలాంటి సమయంలో నీరున్న చోట చూసి నెమ్మదిగా వెళ్లాలని నెటిజన్లు సూచిస్తున్నారు. మీకూ ఇలాంటి ఇబ్బంది ఎదురైందా? SHARE IT
News August 21, 2025
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తోన్న బంగారం ధరలు ఇవాళ కాస్త పెరిగాయి. HYD బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములపై రూ.600 పెరిగి రూ.1,00,750కు చేరింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములపై రూ.500 ఎగబాకి రూ.92,300 పలుకుతోంది. అటు KG వెండిపై రూ.1,000 పెరిగి రూ.1,26,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.