News August 21, 2025

తూప్రాన్: 4 నెలల క్రితం భర్త మృతి.. భార్య సూసైడ్

image

భర్త మరణంతో కుటుంబ పోషణ భారమై భార్య ఆత్మహత్యకు పాల్పడినట్లు తూప్రాన్ ఎస్ఐ శివానందం తెలిపారు. తూప్రాన్‌కు చెందిన గజ్జల బాబుకు సంధ్యతో వివాహం జరిగింది. ఆర్థిక ఇబ్బందులతో 4 నెలల క్రితం బాబు ఆత్మహత్య చేసుకున్నాడు. బాబు మరణంతో భార్య సంధ్య(34)కు కుటుంబ పోషణ భారమైంది. ఈ క్రమంలో 13న ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు ఎస్ఐ పేర్కొన్నారు.

Similar News

News August 21, 2025

ప్రశాంత వాతావరణంలో నవరాత్రులు జరుపుకోవాలి: కలెక్టర్, ఎస్పీ

image

మెదక్ జిల్లా వ్యాప్తంగా గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ సభ్యులు సహకరించాలని కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు సూచించారు. బుధవారం శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. గణపతి ఉత్సవ కమిటీ సభ్యులు, హిందూ ఉత్సవ సమితి ప్రతినిధులు, ముస్లిం మత పెద్దలు, వివిధ మండప నిర్వాహకులు పాల్గొన్నారు. సభ్యుల సందేహాలను కలెక్టర్, ఎస్పీ నివృత్తి చేశారు.

News August 20, 2025

మెదక్: అక్టోబర్ 12న జంగ్ సైరన్: ఎస్టీయూ

image

ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల హక్కుల సాధన కోసం అక్టోబర్ 12న ‘చలో హైదరాబాద్’ పేరిట ‘జంగ్ సైరన్’ నిర్వహించనున్నట్లు ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సదానందం గౌడ్ తెలిపారు. మెదక్‌లో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయిలో సుమారు లక్ష మంది కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. హక్కులను సాధించుకోవడానికి ఈ ఉద్యమ కార్యాచరణను ప్రకటించినట్లు వెల్లడించారు. జిల్లా అధ్యక్షుడు రాజగోపాల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

News August 20, 2025

మెదక్: ‘మళ్లీ జైలుకు రావొద్దు’

image

మెదక్ సబ్ జైలును జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ ఆర్.ఎం.సుభవల్లి తనిఖీ చేశారు. ఖైదీలకు అందుతున్న వసతులు, వారి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. న్యాయ సలహాలు ఇచ్చారు. మీరు తప్పులు చేసి జైలుకు వస్తే మీ వల్ల మీ కుటుంబం ఇబ్బందులకు గురవుతుంది. మానసికంగా క్షోభకు గురవుతారన్నారు. కావున ఒకసారి జైలు నుంచి బయటకు వెళ్లాక సత్ప్రవర్తనతో మెలగాలని, మళ్లీ తప్పులు చేసి జైలుకు రావొద్దని సూచించారు.