News August 21, 2025

జిల్లాలో సమృద్ధిగా యూరియా నిల్వలు: కలెక్టర్ ప్రావీణ్య

image

సంగారెడ్డి జిల్లాలో సమృద్ధిగా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ పి. ప్రావీణ్య తెలిపారు. బుధవారం ఆమె సిర్గాపూర్‌లో ఫర్టిలైజర్ దుకాణంలో ఎరువుల విక్రయాలను పరిశీలించారు. జిల్లాలో వ్యవసాయ సాగుకు అవసరమైన యూరియా సమృద్ధిగా ఉందని తెలిపారు. యూరియాను పంట సాగుకు మాత్రమే వినియోగించాలని సూచించారు. రెవెన్యూ, పోలీస్, వ్యవసాయ శాఖల సమన్వయంతో టాస్క్ ఫోర్స్ టీం అక్రమ రవాణా జరగకుండా చూస్తుందన్నారు.

Similar News

News August 21, 2025

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

image

గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తోన్న బంగారం ధరలు ఇవాళ కాస్త పెరిగాయి. HYD బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములపై రూ.600 పెరిగి రూ.1,00,750కు చేరింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములపై రూ.500 ఎగబాకి రూ.92,300 పలుకుతోంది. అటు KG వెండిపై రూ.1,000 పెరిగి రూ.1,26,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News August 21, 2025

కృష్ణా: జిల్లాల పేర్ల మార్పుపై ఉత్కంఠ

image

జిల్లాల పునర్విభజనపై ఏపీ కేబినెట్ సబ్‌ కమిటీ ఈరోజు సమావేశం కానుంది. ఇందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లాను విజయవాడగా మార్చి, కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నూజివీడు, గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లాలో, కైకలూరును కృష్ణాలో, నందిగామ, జగ్గయ్యపేటలను అమరావతి జిల్లాలో విలీనం చేయనున్నట్లు సమాచారం.

News August 21, 2025

నేపాల్‌ వాదనను ఖండించిన భారత్

image

భారత సరిహద్దులో ఉన్న లింపియాధుర, లిపులేఖ్, కాలాపాణిలు తమ ప్రాంతాలేనన్న నేపాల్ వాదనను భారత్ ఖండించింది. ‘లిపులేఖ్ ద్వారా IND-CHINA మధ్య 1953లోనే వాణిజ్యం మొదలైంది. తర్వాత కొన్ని కారణాలతో నిలిచిపోయింది. ఇప్పుడు దాన్ని మళ్లీ ప్రారంభించాలని ఇరుదేశాలూ నిర్ణయించాయి. దీనిపై నేపాల్ అభ్యంతరం చెప్పడం సరికాదు’ అని పేర్కొంది. కాగా IND-CHI వివాదాలు పక్కనబెట్టి వాణిజ్య సంబంధాలను పునరుద్ధరించుకుంటున్నాయి.