News August 21, 2025

టీమ్ ఇండియా మేనేజర్‌గా జనసేన MLA కుమారుడు

image

ఆసియా కప్‌లో పాల్గొనే భారత జట్టుకు మేనేజర్‌గా ఆంధ్రాకు చెందిన పీవీఆర్ ప్రశాంత్ నియమితులయ్యారు. ప్రశాంత్ ప్రస్తుతం ఏసీఏ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. గతంలో పశ్చిమగోదావరి జిల్లా టీమ్ ప్లేయర్‌గా రాణించారు. కాగా భీమవరం జనసేన ఎమ్మెల్యే పులపర్తి ఆంజనేయులు కుమారుడే ప్రశాంత్. అలాగే భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు అల్లుడు కూడా. ఈ నెల 9 నుంచి 28 వరకు ఆయన టీమ్ ఇండియాతో పర్యటించనున్నారు.

Similar News

News August 21, 2025

రూ.400 కోట్ల ఆస్తిని కాపాడిన హైడ్రా!

image

TG: ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. HYD మాదాపూర్ జూబ్లీ ఎన్‌క్లేవ్‌లో పార్కులతో పాటు రహదారుల ఆక్రమణలను తొలగించింది. GHMCకి గిఫ్ట్ డీడ్ చేసిన పార్కులను జైహింద్ రెడ్డి అనే వ్యక్తి కబ్జా చేశారన్న ఎన్‌క్లేవ్ ప్రతినిధుల ఫిర్యాదుతో క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేపట్టింది. కబ్జాకు గురైన 16వేల గజాల స్థలాన్ని పరిరక్షించింది. వీటి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. వీటి విలువ రూ.400 కోట్లని సమాచారం.

News August 21, 2025

రూ.కోటి ప్రశ్నకు సమాధానం చెప్పగలరా?

image

‘కౌన్ బనేగా కరోడ్‌పతి- 17’లో ఉత్తరాఖండ్‌కు చెందిన IPS ఆదిత్య కుమార్ రూ.కోటి గెలుచుకుని సత్తాచాటారు. ఈ సీజన్‌లో ఈయనే తొలి కరోడ్‌పతి కావడం విశేషం. ఈ సందర్భంగా నెట్టింట ఆయనపై ప్రశంసలు కురుస్తున్నాయి. రూ.కోటి ప్రశ్న ఇదే.. ‘మొదటి అణు బాంబు తయారీకి ఉపయోగించిన ప్లూటోనియం అనే మూలకాన్ని వేరుచేసిన శాస్త్రవేత్త పేరు మీద ఉన్న మూలకం ఏది? A. సీబోర్జియం, B. ఐన్‌స్టీనియం, C. మైట్‌నేరియం, D. బోహ్రియం. ANS ఏంటి?

News August 21, 2025

లోక్‌సభ నిరవధిక వాయిదా

image

లోక్‌సభ నిరవధిక వాయిదా పడింది. 21 రోజుల పాటు సభ జరిగింది. సమావేశాల సందర్భంగా నిన్న ఆన్‌లైన్ గేమింగ్ బిల్లుకు ఆమోదం లభించింది.