News August 21, 2025
అన్నమయ్య: వినాయక విగ్రహాలకు పర్మిషన్ ఇలా.!

అన్నమయ్య జిల్లాలో వినాయక విగ్రహాల ఏర్పాటుకు ప్రతి ఒక్కరూ కచ్చితంగా పోలీసుల పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అది ఎలానో ఇప్పుడు చూద్దాం.
➤<
➤ఫోన్ నంబర్ టైప్ చేసి ఓటీపి ఎంటర్ చేయండి.
➤ తర్వాత అక్కడ అడిగే అన్ని వివరాలు నమోదు చేసి సబ్‌మిట్ చేయండి.
➤NOTE: అప్లికేషన్‌లో విగ్రహం సైజ్ ఎంతో చెప్పాల్సి ఉంటుంది.
➤ఇలా ముందుగానే విగ్రహాన్ని బుక్ చేసుకుని పర్మీషన్ పొందండి.
Similar News
News March 23, 2026
గ్యాస్ దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తప్పవు: ADB SP

ఆదిలాబాద్ జిల్లాలో గృహ వినియోగ LPG గ్యాస్‌ను వాణిజ్య అవసరాలకు వినియోగించవద్దని SP అఖిల్ మహాజన్ హెచ్చరించారు. రేపటి నుంచి జిల్లా వ్యాప్తంగా 8 బృందాలతో హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించనున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. గ్యాస్ దుర్వినియోగం ప్రమాదాలకు దారి తీస్తుందని సూచించారు. అనుమానాస్పద వినియోగంపై డయల్ 100కు సమాచారం ఇవ్వాలని కోరారు.
News March 23, 2026
శ్రీకాకుళం: సదరంలో మరో ఐదు కొత్త వైకల్యాల చేర్పు.. DMHO వెల్లడి

వైకల్య సదరం సర్టిఫికెట్లు జారీలో కొత్తగా ఐదు రకాల వైకల్యాలను జాబితాలో చేర్చినట్లు DMHO అనిత సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో యాసిడ్ దాడిబాధితులు, స్పీచ్&లాంగ్వేజ్ డిజాస్టర్, అభ్యాసవైకల్యం, ఆటిజం స్పెక్ట్రమ్ డిజాస్టర్, బహుళ వైకల్యం ఉన్నాయన్నారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని ఆమె అన్నారు. ఈనెల 25 నుంచి స్లాట్ బుకింగ్, 30 నుంచి నిర్ధారణ పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే.
News March 23, 2026
ఎక్స్పైరీ పేరిట రూ.40 కోట్ల మందులు మాయం!

TG: పేద రోగులకోసం వినియోగించాల్సిన ₹40 కోట్ల విలువైన మెడిసిన్స్ పక్కదారి పట్టినట్లు సమాచారం. హాస్పిటల్స్‌కు పంపిణీ చేసే ప్రధాన కేంద్రం నుంచి ఈ మందులను ఎక్స్పైరీగా చూపి బయటి షాపులకు తరలిస్తున్నట్లు విజిలెన్స్ విభాగం గుర్తించింది. క్యాన్సర్ వంటి రోగాలకు వాడే మందులూ ఇలా పక్కదారి పడుతున్నాయని కనుగొంది. విచారణలో స్టోర్ కీపర్ల వాంగ్మూలాలు నమోదు చేసింది. దీనిపై నివేదిక(H&FW/VIG/40CR-MED) రెడీ చేసింది.


