News August 21, 2025
ఖమ్మం: కాన్పులకు వస్తే కోయడమేనా?

ఖమ్మం జిల్లాలో సాధారణ ప్రసవాల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. సాధారణ ప్రసవాలకే ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం చెబుతున్నా, ప్రైవేటులో అందుకు విరుద్ధంగా కనిపిస్తుంది. ధనార్జనే ధ్యేయంగా వివిధ కారణాలు చెబుతూ సిజేరియన్లు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. గతేడాది జిల్లాలో దాదాపు 10 వేల సిజేరియన్లు జరిగితే, 5 వేల సాధారణ కాన్పులు జరగడం గమనార్హం. ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.
Similar News
News March 15, 2026
వరంగల్ జిల్లాలో నిబంధనలు బేఖాతరు !

వరంగల్ జిల్లాలో కొన్ని మెడికల్ షాపులు నిబంధనలకు విరుద్ధంగా మత్తు మందులను విక్రయిస్తున్నాయి. డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండానే అమ్మి సోమ్ము చేసుకుంటున్నాయి. ఇటీవల హన్మకొండలో మత్తులో ఉన్న యువకులను నార్కోటిక్ పోలీసులు పట్టుకోవడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. గతంలో కాజీపేటలో ఇలాంటి ఘటనే జరగ్గా, తాజాగా వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ సమీపంలోని ఓ షాపును అధికారులు సీజ్ చేశారు.

బెండలో బూడిద, పల్లాకు తెగులు నివారణ

☛ బూడిద తెగులు వల్ల ఆకులు పచ్చబడి రాలిపోతాయి. నివారణకు లీటర్ నీటిలో 3 గ్రా. కరిగే గంధకపు పొడి లేదా 1mlడైనోకాప్ (లేదా) 2mlహెక్సాకొనజోల్ కలిపి పిచికారీ చేయాలి. ☛ బెండలో పల్లాకు తెగులు సోకిన ఆకుల ఈనెలు పసుపు రంగులోకి మారి, కాయలు గిడసబారి తెల్లగా మారిపోతాయి. పల్లాకు తెగులు నివారణకు లీటర్ నీటిలో 2.5 గ్రా. క్లోరోథలానిల్ (లేదా) 2.5 గ్రా. మ్యాంకోజెబ్ కలిపి పిచికారీ చేయాలి.