News August 21, 2025

ఖమ్మం: వైన్ షాపుల దరఖాస్తు ఫీజు రూ.3 లక్షలు

image

రాష్ట్ర ప్రభుత్వం వైన్స్ షాపుల టెండర్ నోటిఫికేషన్‌ను బుధవారం విడుదల చేసింది. నూతన ఎక్సైజ్ పాలసీలో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 210 వైన్ షాపులకు త్వరలో దరఖాస్తులు స్వీకరించనున్నారు. గతంలో వైన్స్ దరఖాస్తు ఫీజు రూ.2లక్షలు ఉండగా ఈసారి రూ.3లక్షలకు పెంచారు. వచ్చే నవంబర్‌లో టెండర్ల గడువు ముగియనుండగా, అంతకుముందే రెండేళ్ల కాలానికి కొత్త షాప్ ఏర్పాటుకు దరఖాస్తులు స్వీకరించి టెండర్లు ఖరారు చేయనున్నారు.

Similar News

News March 19, 2026

‘ధర్మపురి బస్సు డిపో మంజూరుకు కృషి చేస్తా’

image

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రితో మాట్లాడి ధర్మపురిలో బస్ డిపో మంజూరు కోసం కృషి చేస్తానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. వచ్చే గోదావరి పుష్కరాల వరకు ధర్మపురిలో బస్ డిపో నిర్మాణం పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటామని మంత్రి వివరించారు. గురువారం ధర్మపురిలోని ఎస్‌హెచ్ గార్డెన్‌లో ముస్లిం సోదరులకు తోఫా పంపిణీ కార్యక్రమంలో మంత్రి పైవిధంగా వ్యాఖ్యలు చేశారు.

News March 19, 2026

IPL-2026: స్టార్ బౌలర్లు దూరం!

image

IPL-2026కు మరో ఇద్దరు విదేశీ బౌలర్లు దూరం కానున్నారు. రాజస్థాన్ తరఫున ఆడనున్న సామ్ కరన్ (ఇంగ్లండ్) గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరం అయ్యారని క్రీడావర్గాలు వెల్లడించాయి. అటు పంజాబ్ కింగ్స్ బౌలర్ ఫెర్గూసన్ (న్యూజిలాండ్) ఇటీవల తండ్రి అయ్యారు. బిడ్డతో గడిపేందుకు స్వదేశానికి వెళ్లనుండటంతో ఆరంభంలోని కొన్ని మ్యాచులకు దూరం కానున్నారు. ఇప్పటికే కమిన్స్, హేజిల్‌వుడ్ కొన్ని మ్యాచులు ఆడట్లేదు.

News March 19, 2026

ఇరాన్ అటాక్‌తో ఖతర్‌కు ₹9.3లక్షల కోట్ల నష్టం!

image

ఇరాన్ చేసిన దాడులతో ఖతర్‌ ఏటా $20 బిలియన్ల (₹1.86లక్షల కోట్లు) వార్షిక ఆదాయం కోల్పోయిందని ఖతర్ ఎనర్జీ సీఈవో వెల్లడించారు. దీని ప్రభావం ఐదేళ్ల పాటు ఉండి.. మొత్తం ₹9.3లక్షల కోట్ల ఆదాయం కోల్పోయామన్నారు. ఈ దాడులతో ఖతార్ LNG ఎగుమతి సామర్థ్యం 17% తగ్గిందని.. ఏటా 12.8 మిలియన్ టన్నుల ఉత్పత్తి తగ్గనుందని తెలిపారు. దీంతో లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ కుదుర్చుకున్న దేశాలకు LNG సరఫరా సవాల్‌గా మారిందన్నారు.