News August 21, 2025

ప్రకాశం: వినాయక విగ్రహాలకు పర్మిషన్ ఇలా.!

image

ప్రకాశం జిల్లాలో వినాయక విగ్రహాల ఏర్పాటుకు ప్రతి ఒక్కరూ కచ్చితంగా పోలీసుల పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అది ఎలానో ఇప్పుడు చూద్దాం.
➤<>దీనిపై క్లిక్ చేయండి.<<>>
➤ఫోన్ నంబర్ టైప్ చేసి ఓటీపి ఎంటర్ చేయండి.
➤ తర్వాత అక్కడ అడిగే అన్ని వివరాలు నమోదు చేసి సబ్‌మిట్ చేయండి.
NOTE: అప్లికేషన్‌లో విగ్రహం సైజ్ ఎంతో చెప్పాల్సి ఉంటుంది.
ఇలా ముందుగానే విగ్రహాన్ని బుక్ చేసుకుని పర్మీషన్ పొందండి.

Similar News

News August 21, 2025

ప్రకాశానికి మంత్రుల రాక

image

జిల్లాల పునర్విభజన మార్పులపై ఏర్పాటు చేసిన మంత్రుల బృందం ఈ నెల 30వ తేదీన ప్రకాశం జిల్లాకు రానున్నట్లు సమాచారం. ప్రకాశం జిల్లాలోని మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటించడం, కందుకూరును జిల్లాలో కలపడం, ఇతర అంశాలపై మంత్రుల బృందం ప్రజాభిప్రాయ సేకరణ చేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. మంత్రులు నిమ్మల రామానాయుడు, సత్య కుమార్ యాదవ్ జిల్లాకు రానున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే అధికారులు ధృవీకరించాల్సి ఉంది.

News August 21, 2025

పొదిలి: టీ తాగి వస్తానని భర్త పరార్.!

image

పొదిలిలోని పోతవరానికి చెందిన యువకుడు ప్రేమించి వివాహం చేసుకున్న భార్యకు మొహం చాటేసి పరారయ్యాడు. ఈ మేరకు బాధితురాలు బుధవారం పొదిలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తెలంగాణలోని ఆర్మూరు బస్ స్టేషన్‌లో టీ తాగి వస్తానని వదిలేసి పరారయ్యాడని, తీరా పొదిలికి వస్తే రూ.10 లక్షలు తెస్తేనే భార్యగా అంగీకరిస్తానని చెబుతున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News August 21, 2025

పొదిలి: టీ తాగి వస్తానని భర్త పరార్.!

image

పొదిలిలోని పోతవరానికి చెందిన యువకుడు ప్రేమించి వివాహం చేసుకున్న భార్యకు మొహం చాటేసి పరారయ్యాడు. ఈ మేరకు బాధితురాలు బుధవారం పొదిలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తెలంగాణలోని ఆర్మూరు బస్ స్టేషన్‌లో టీ తాగి వస్తానని వదిలేసి పరారయ్యాడని, తీరా పొదిలికి వస్తే రూ.10 లక్షల తెస్తేనే భార్యగా అంగీకరిస్తానని చెబుతున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.