News August 21, 2025

కామారెడ్డి జిల్లాలో పంట నష్టం ఎంతంటే?

image

కామారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు 4392.55 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు DAO మోహన్ రెడ్డి Way2Newsతో తెలిపారు. జిల్లాలోని 2,522 మంది రైతులకు ఈ నష్టం వాటిల్లిందని చెప్పారు. సోయా-2,540 ఎకరాలు, వరి-1,619.15, పత్తి-85, పెసలు-100, మొక్కజొన్న- 97, టమాట, కాకర, బీర- 1.4 ఎకరాల్లో ప్రాథమిక అంచనా ప్రకారం ఈ నష్టం జరిగిందని, పూర్తిస్థాయి నివేదిక కోసం సర్వే జరుగుతుందని ఆయన తెలిపారు.

Similar News

News March 11, 2026

యుద్ధం తిప్పలు.. ‘షార్ట్స్ వేసుకోండి, మెట్లు ఎక్కండి’

image

మిడిల్ ఈస్ట్ యుద్ధంతో విద్యుత్ ఆదా చేసేందుకు థాయిలాండ్ ప్రధాని అక్కడి ఉద్యోగులకు స్పెషల్ రూల్స్ ప్రవేశపెట్టారు. ఆఫీసుల్లో ఏసీలు 26-27 డిగ్రీల వద్దే మెయింటెన్ చేయాలని ఆదేశించారు. సూట్లు, టైలకు బదులు షార్ట్స్, షర్ట్స్ వేసుకోవాలని సూచించారు. ఎలివేటర్లకు బదులు మెట్లు ఉపయోగించాలని, వీలైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని ఆదేశించారు. కాగా థాయిలాండ్‌లో 68% విద్యుత్ నేచురల్ గ్యాస్ నుంచే ఉత్పత్తి అవుతోంది.

News March 11, 2026

ఈ టైమ్‌లో ఎండలో నిలబడండి..

image

భారతదేశంలో సూర్యరశ్మి పుష్కలంగా ఉన్నప్పటికీ మెజారిటీ ప్రజలు విటమిన్-డి లోపంతో సతమతమవుతున్నారు. మీకు 30-100 ng/mL మధ్య ఉంటే డి విటమిన్ సరిపడా ఉందని అర్థం. సహజంగా దీనిని పెంచుకునేందుకు రోజూ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య కనీసం 30 నిమిషాలు ఎండలో ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎముకల పుష్టికి, రోగనిరోధక శక్తికి ఈ ‘సన్ షైన్’ విటమిన్ ఎంతో కీలకమని పేర్కొన్నారు.

News March 11, 2026

అడవి వదిలి… ఊరి బాట పట్టిన వానరాలు

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు గ్రామాల్లో కోతుల గుంపులు ప్రజలను వణికిస్తున్నాయి. అడవిని విడిచి ఊర్ల బాట పట్టిన కోతులు, నేరుగా ఇళ్లలోకి చొరబడి తినుబండారాలను ఎత్తుకెళ్తున్నాయి. పర్యాటక ప్రాంతాలు, ఆలయాల వద్ద భక్తులు ఇచ్చే ఆహారానికి అలవాటు పడి ఇప్పుడు అడవిలో ఆహారం వెతుక్కోవడానికి ఇష్టపడటం లేదు. దీంతో ప్రజలు కంటిమీద కునుకు లేకుండా భయాందోళన చెందుతున్నారు.