News August 21, 2025

విషాదం.. వేడి పాలు నోటిలో పడి చిన్నారి మృతి

image

వేడి పాలు చిన్నారి ప్రాణం తీశాయి. ఈ విషాద ఘటన గుత్తి కోటలో జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. ప్రతాప్ రెడ్డి, మేనక దంపతుల కుమారుడు షర్మిల్ రెడ్డి (15 నెలల బాలుడు) వేడి చేసిన పాలను తాగడానికి ప్రయత్నించాడు. ప్రమాదవశాత్తు అవి నోరు, ముక్కులో పడ్డాయి. ఊపిరాడకపోవడంతో మరణించాడు. ఈ ఘటనతో కోటవీధిలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Similar News

News August 21, 2025

కడప: ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగింపు

image

కడపలో ఉన్న ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ప్రవేశాల కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గడువు ఆగస్టు 26 వరకు ఉందని ప్రన్సిపల్ రత్నరాజు తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈనెల 26న సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 8555958200 నంబర్‌కు సంప్రదించవచ్చని సూచించారు.

News August 21, 2025

నివేదిక రద్దు చేయాలని పిటిషన్లు.. విచారణ వాయిదా

image

TG: కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను రద్దు చేయాలన్న <<17470256>>కేసీఆర్<<>>, హరీశ్ రావు పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటారా, అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చ తర్వాత చర్యలు తీసుకుంటారా అని కోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వ నిర్ణయం చెప్పడానికి సమయం కావాలని ఏజీ కోరగా, విచారణ రేపటికి వాయిదా పడింది.

News August 21, 2025

HYDలో SMART మీటర్ వాల్వ్‌లు వస్తున్నాయి!

image

జలమండలి పరిధిలో దాదాపుగా 5,000 వరకు గృహాలకు సరఫరా చేసేందుకు మెయిన్ వాల్వ్‌లు ఉన్నాయి. వీటిలో మొదట 1000 వాల్వ్‌లను స్మార్ట్ వాల్వ్‌లుగా మార్చేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. స్మార్ట్ ఆటోమేటిక్ వాల్వ్‌లతో నిర్ణీత సమయంలో నీటిని సరఫరా చేయడం, నాణ్యత గుర్తించడం, ఇతర సమస్యలకు చెక్ పెట్టొచ్చనే నేపథ్యంలో వాటిపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.