News August 21, 2025

గుర్తింపులేని పార్టీలకు షోకాజ్ నోటిసులిచ్చాం: కలెక్టర్

image

గుంటూరు జిల్లాలో రిజిస్ట్రేషన్ చేయబడి 2019 నుంచి ఇప్పటి వరకు ఎన్నికల్లో పోటీచేయని గుర్తింపు లేని పార్టీలకు ఈసీ షోకాజ్ నోటీసులు జారీచేసిందని కలెక్టర్ నాగలక్ష్మీ తెలిపారు. గ్రేట్ ఇండియా పార్టీ, వెనుకబడిన వర్గాల మహిళా రైతు పార్టీలకు నోటీసులు ఇచ్చామని చెప్పారు. ఆ పార్టీల బాధ్యులు ఈనెల 28 లోపు వెలగపూడి సచివాలయం 5వ బ్లాక్ ప్రధాన ఎన్నికల అధికారిముందు వివరణ ఇచ్చేందుకు ఆధారపత్రాలతో హాజరు కావాలన్నారు.

Similar News

News August 21, 2025

JANలో ‘దేవర-2’ షూట్.. ఆ తర్వాతే వేరే మూవీ!

image

‘దేవర-2’ సినిమా అటకెక్కిందని వస్తోన్న ప్రచారం ఫేక్ అని సినీవర్గాలు తెలిపాయి. ప్రస్తుతం డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమా స్క్రిప్ట్, ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్లు వెల్లడించాయి. అన్నీ కుదిరితే జనవరి నుంచి షూట్ మొదలు పెట్టేలా ప్లాన్ చేస్తున్నారని, ఇది పూర్తయ్యాకే మిగతా సినిమాలపై దృష్టి పెడతారని చెప్పాయి. కాగా ‘దేవర-2’ 2027 సంక్రాంతి బరిలో నిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

News August 21, 2025

కడప జిల్లాలో 81 మంది MPEOలు బదిలీ

image

కడప జిల్లా వ్యవసాయ శాఖలో పనిచేసే 81 మంది మల్టీ పర్పస్ ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ (MPEO)లను బదిలీ చేశారు. ఈ మేరకు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి చంద్రనాయక్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిని పని సర్దుబాటు కోసం బదిలీ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వీరిలో కొందరిని ఒక మండలం నుంచి మరొక మండలానికి, మరి కొందరిని ఒక డివిజన్ నుంచి వేరే డివిజన్ కు బదిలీ చేశారు. వీరు గ్రామాల్లో రైతులకు సహాయంగా RSKల్లో ఉంటారు.

News August 21, 2025

సిరిసిల్ల: ’నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి’

image

గణేష్ మండపాల నిర్వాహకులు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సిరిసిల్ల ఎస్పీ మహేష్ బీ గీతే అన్నారు. సిరిసిల్లలోని SP కార్యాలయంలో గురువారం ప్రకటన విడుదల చేశారు. మండపాలు ప్రజా రవాణా, ఎమర్జెన్సీ వాహనాలకు ఇబ్బందులేకుండా ఏర్పాటు చేసుకోవాలన్నారు. విద్యుత్ శాఖ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. మండపాల నిర్వాహకుల బాధ్యత వహించే వారి ఫోన్ నెంబర్లు మండపాలలో ఏర్పాటు చేయాలన్నారు. CC కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు.