News August 21, 2025

ఖమ్మం: ఉపాధ్యాయుల పదోన్నతులకు లైన్ క్లియర్

image

ఖమ్మం జిల్లాలో స్కూల్ అసిస్టెంట్లకు ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు కల్పిం చేలా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈమేరకు గురువారం ఉదయం వరకు సీనియారిటీ జాబితాలో ఉన్న ఎస్ఏలు వెన్ఆప్షన్లు పెట్టుకోవాలని సూచించింది. జోనల్ స్థాయిలో 1,300 మందికి అవకాశముండగా, ఖమ్మం జిల్లాలో 70 మంది హెచ్ఎంలుగా పదోన్నతి పొందనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక ఎస్ఓటీలకు ఎస్ఏలుగా పదోన్నతి కల్పించనున్నారు.

Similar News

News August 21, 2025

ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన

image

రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నట్లు మంత్రి క్యాంప్ కార్యాలయం అధికారులు తెలిపారు. ఉదయం 10 గంటలకు తల్లాడ, కల్లూరు, సత్తుపల్లి మండలంలో మంత్రి పర్యటిస్తారని చెప్పారు. మధ్యాహ్నం 2 గంటలకు కూసుమంచి మండలం జీళ్లచెరువులో వెంకటేశ్వర స్వామి గుడికి, అంతర్గత సీసీ రోడ్లకు శంకుస్థాపన చేయనున్నారు.

News August 21, 2025

ఖమ్మం: యూరియా కొరత లేకుండా చూడాలి: మాజీ ఎంపీ

image

తెలంగాణ వ్యాప్తంగా యూరియా కొరత లేకుండా చూడాలని, యూరియా నిల్వలు కావాల్సిన మేర అందుబాటులో ఉంచి రైతులకు సకాలంలో అందజేయాలని బీఆర్ఎస్ లోక్‌సభ మాజీ పక్షనేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు కోరారు. ఒక రైతు బిడ్డగా పార్లమెంట్‌లో రైతుల సమస్యల కోసం పోరాటం చేశానని గుర్తు చేశారు.

News August 21, 2025

ఖమ్మం: ఈ ప్రాంతాల్లోనే వర్షపాతం నమోదు

image

జిల్లాలో బుధవారం ఉదయం 8:30 నుంచి గురువారం ఉదయం 8:30 వరకు 8.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఖమ్మం రూరల్ 3.4, కామేపల్లి, చింతకాని, వైరా 1.2, ఏన్కూరు 1.0, నేలకొండపల్లి మండలంలో 0.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపారు. అటు ఇతర మండలాల్లో ఎలాంటి వర్షపాతం నమోదు కాలేదని పేర్కొన్నారు.