News August 21, 2025
వచ్చే నెల 27న బాపట్లకు రానున్న సీఎం: కలెక్టర్

ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 27న సీఎం చంద్రబాబు నాయుడు బాపట్లకు వస్తారని కలెక్టర్ వెంకట మురళి తెలిపారు. సూర్యలంక సముద్రతీరం వద్ద సెప్టెంబర్ 26, 27, 28న నిర్వహించనున్న బీచ్ ఫెస్టివల్‌పై ఆయన కలెక్టరేట్‌లో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రూ.97 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తారన్నారు.
Similar News
News March 20, 2026
కాకినాడ: పులి అదే రూట్‌లో వెళ్లింది..!

కాకినాడ జిల్లా నుంచి పెద్దపులి తిరిగి పోలవరం జిల్లాకు వెళ్లిపోయింది. రాజఒమ్మంగి మండలం వద్ద పులి సంచారాన్ని గురువారం స్థానికులు గుర్తించారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలోని పలు మండలాలకు ఏ దారిలో వచ్చిందో, తిరిగి అదే దారిలో పోలవరం వైపు వెళ్లిపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. పులి భయం తొలగిపోవడంతో నియోజకవర్గ ప్రజలు ఊరట చెందుతున్నారు. పులి మళ్లీ రాకూడదని దేవుడిని ప్రార్థిస్తున్నారు.
News March 20, 2026
వరంగల్: నిధుల కోసం ఎదురుచూపులు!

ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొత్తగా ఏర్పడిన పంచాయతీలు, మున్సిపాలిటీల అభివృద్ధికి నిధుల కోసం ప్రజాప్రతినిధులు ఎదురు చూస్తున్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులతోనే ఇప్పటి వరకు నిర్వహణ సాగుతోంది. పట్టణాలు, గ్రామాలు అభివృద్ధిలో ముందుకు సాగాలన్న, గెలిచిన నాయకుల పేరు నిలవాలన్నా నిధులు శుక్రవారం బడ్జెట్‌లో ఒక్కో పంచాయతీకి రూ.50 లక్షలు, పురపాలికలకు రూ.కోటి కేటాయించాలని సర్పంచ్‌లు, ఛైర్‌పర్సన్లు డిమాండ్ చేస్తున్నారు.
News March 20, 2026
ఎచ్చెర్ల: 18 ఏళ్లలో 7 నియామకాలు మాత్రమే..?

ఎచ్చెర్లలోని ఆంధ్రా యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కేంద్రాన్ని 2008 జూన్ 25న డాక్టర్ B.Rఅంబేడ్కర్ విశ్వవిద్యాలయంగా అప్గ్రేడ్ చేసి 18 ఏళ్లు కావొస్తుంది. ఇప్పటివరకు ఏడుగురు రెగ్యులర్ ఫ్యాకల్టీని మాత్రమే నియమించారు. 2010 నోటిఫికేషన్‌లో బయో టెక్నాలజీలో నలుగురు, సోషల్ వర్క్‌లో 3 నియామకాలు చేపట్టారు. ప్రభుత్వాలు మారినా, వైస్ ఛాన్సిలర్లు మారినా.. రెగ్యులర్ ఫ్యాకల్టీ నియామకాలు జరగలేదనే టాక్ నడుస్తోంది.


