News August 21, 2025
ప్రిస్కిప్షన్ లేకుండా మత్తు మందులు అమ్మితే చర్యలు: మంత్రి దామోదర

TG: డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండా మత్తు మందులు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. డ్రగ్ కంట్రోల్ అథారిటీ పనితీరుపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలతో మెడిసిన్స్ అమ్మే కంపెనీలు, వ్యక్తులపై చర్యలు తీసుకోవాలన్నారు. పదే పదే నిబంధనలు ఉల్లంఘించే సంస్థలను చట్ట ప్రకారం శాశ్వతంగా మూసివేయాలన్నారు.
Similar News
News March 4, 2026
శ్రీవారి పేరు ఉచ్చరించే నైతికత నీకుందా జగన్: బీఆర్ నాయుడు

AP: హిందుత్వం గురించి మాట్లాడే అర్హత <<19295165>>జగన్‌కు<<>> లేదని టీటీడీ ఛైర్మన్ BR నాయుడు విమర్శించారు. శ్రీవారి పేరు ఉచ్చరించే నైతికత ఆయనకు లేదని ఫైరయ్యారు. ‘హిందూ వ్యతిరేకి అయిన నువ్వు CMగా ఉన్నావనే వైవీ, భూమన హిందూ మత ఔన్నత్యాన్ని మంటగలిపారు. నేను ఛైర్మన్ అయ్యాక TTDని ప్రక్షాళన చేస్తున్నా. అందుకే నాపై ఫేక్ వీడియోలతో తిరుమల ప్రతిష్ఠ దెబ్బతీయాలని చూశావు’ అని మండిపడ్డారు.
News March 4, 2026
భయం పుట్టించే B-2 తయారీలో ఇండో-అమెరికన్!

ప్రపంచంలో భయంకరమైన యుద్ధ ఆయుధాల్లో <<19277612>>B-2<<>> బాంబర్ టాప్‌లో ఉంటుంది. దీని తయారీలో భారత సంతతికి చెందిన నోషిర్ గొవాడియాది కీలకపాత్ర. 1944లో బాంబేలో జన్మించిన ఈయన USకు వెళ్లి ఏరోనాటికల్ ఇంజినీరింగ్ చదివారు. నార్త్‌రోప్ గ్రుమ్మన్ కంపెనీలో డిజైన్ ఇంజినీర్‌గా చేరారు. B-2 బాంబర్లు శత్రువుల రాడార్లకు కనబడకుండా స్పెషల్ డిజైన్ చేశారు. చైనాకు దీని సమాచారం ఇచ్చారని US కోర్టు 2010లో 32 ఏళ్ల జైలుశిక్ష విధించింది.
News March 4, 2026
రాజ్యసభ రేసు: రాష్ట్ర కాంగ్రెస్‌లో ఉత్కంఠ

TG: రాష్ట్ర నుంచి రాజ్యసభ సభ్యుల ఎంపిక ప్రక్రియ కాంగ్రెస్‌లో ఉత్కంఠగా మారింది. 1 స్థానం సింఘ్వీకి ఖరారైనట్లే. రెండో ప్లేస్‌కు వేం నరేందర్ రెడ్డి కోసం CM రేవంత్ పట్టుబడుతుండగా, తనకు అవకాశమివ్వాలని ప్రియాంక గాంధీ ద్వారా AICC కార్యదర్శి వంశీచంద్ రెడ్డి ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా రమణ నాయక్ పేరు తెరపైకి వచ్చింది. రమణ నాయక్ CMకు సన్నిహితుడే. TDP అధినేత CBNతోనూ ఆయనకు మంచి సంబంధాలున్నాయి.


