News August 21, 2025

మాట్లాడలేకపోతున్న వినోద్ కాంబ్లీ

image

భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ(53) నడవలేని, మాట్లాడలేని స్థితిలో ఉన్నట్లు ఆయన సోదరుడు వెల్లడించారు. ఇండియాకు 104ODIలు, 17టెస్టులు ఆడిన కాంబ్లీ అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. 2024 Decలో మూత్రనాళ ఇన్ఫెక్షన్, తిమ్మిరి సమస్యలు రాగా కొంతకాలం ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆయన ప్రస్తుతం ఇంట్లోనే కోలుకుంటున్నట్లు చెప్పారు. ఆర్థికంగానూ చితికిపోగా ట్రీట్‌మెంట్‌కు అతడి ఫ్రెండ్ సచిన్ సాయం చేశారు.

Similar News

News March 19, 2026

CSKకు బిగ్ షాక్.. కీలక బౌలర్ దూరం

image

మరో 9 రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కానుండగా CSK జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ నాథన్ ఎల్లిస్(AUS) గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యారు. ఈ విషయాన్ని CSK CEO విశ్వనాథన్ తాజాగా ఓ ఈవెంట్‌లో వెల్లడించారు. ఆయన స్థానంలో వేరే బౌలర్ కోసం చూస్తున్నామన్నారు. డెత్ ఓవర్లలో ఎల్లిస్ కీలక బౌలర్ అని, ఆయన దూరమవడం తమకు పెద్ద దెబ్బ అని విశ్వనాథన్ పేర్కొన్నారు.

News March 19, 2026

ఇరాన్ ఆ కేబుల్స్ కట్ చేస్తే ఇంటర్నెట్ బంద్!

image

పశ్చిమాసియా ఉద్రిక్తతలు ఇంటర్నెట్ కనెక్షన్లనూ దెబ్బతీసే ప్రమాదం ఉంది. హార్ముజ్, బాబ్-ఎల్-మాండెబ్ జలసంధుల కింద పెద్ద ఎత్తున డేటా కేబుల్స్ ఉన్నాయి. ఇవి యూరప్, ఆసియా, ఆఫ్రికా మధ్య ఇంటర్నెట్ ట్రాఫిక్‌ను లింక్ చేస్తున్నాయి. యుద్ధంలో భాగంగా ఇవి ధ్వంసమైతే మనకు ఇబ్బందులు తప్పవు. 2024లో హౌతీల దాడుల సమయంలో ఇదే జరిగింది. పైగా మిలిటరీ యాక్టివిటీ వల్ల వాటిని రిపేర్ చేయడానికి నెలల సమయం పట్టింది.

News March 19, 2026

ఈరోజు నమాజ్ వేళలు (17-3-2026) మంగళవారం

image

♦︎ సెహర్: తెల్లవారుజామున 5.11 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6:23 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.25 గంటలకు
♦︎ అసర్: మధ్యాహ్నం 3.47 గంటలకు
♦︎ ఇఫ్తార్: సాయంత్రం 6.27 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.39 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.