News April 1, 2024

రాపూరు: ఆటో బోల్తా.. ఇద్దరికి తీవ్రగాయాలు

image

రాపూరు- చిట్వేల్ ఘాట్ రోడ్ 12 కిలోమీటర్ వద్ద ప్రమాదవశాత్తు అదుపుతప్పి ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన వైద్యం కోసం 108 వాహనం ద్వారా నెల్లూరుకి తరలించారు. చిట్వేల్ ఘాటు వద్ద ఉసిరికాయలకు వెళ్లి తిరుగు ప్రయాణంలో వస్తుండగా ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తులు పంగిలి గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

Similar News

News April 21, 2025

NLR: వాగులో మహిళ మృతదేహం

image

నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో సోమవారం మహిళ మృతదేహం కలకలం రేపింది. అనికేపల్లి సమీపంలోని కర్రోడ వాగులో మహిళ మృతదేహం లభ్యమైంది.  గ్రామస్థులు మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. రెండు రోజుల క్రితం చనిపోయినట్లు అనుమానిస్తున్నారు. వెంకటాచలం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News April 21, 2025

నెల్లూరు జిల్లాలో టీచర్ పోస్టులు ఇలా..!

image

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో డీఎస్సీ ద్వారా 668 పోస్టులు భర్తీ చేయనున్న విషయం తెలిసిందే. రోస్టర్ వారీగా పోస్టులు ఇలా కేటాయిస్తారు.
➤ OC-264 ➤ BC-A:50 ➤ BC-B:61
➤ BC-C:8 ➤ BC-D:46 ➤ BC-E:26
➤ SC- గ్రేడ్1:10 ➤ SC-గ్రేడ్2:40
➤ SC-గ్రేడ్3:51 ➤ ST:43 ➤ EWS:65
➤ PH-విజువల్:2 ➤ PH- హియర్:2
NOTE: సబ్జెక్టుల వారీగా పోస్టుల కోసం <<16155982>>ఇక్కడ <<>>క్లిక్ చేయండి.

News April 21, 2025

నెల్లూరు: చెట్టును ఢీకొని ఇద్దరి మృతి

image

మర్రిపాడు మండలం కదిరి నాయుడుపల్లి వద్ద నిన్న <<16156996>>ప్రమాదం <<>>జరిగిన విషయం తెలిసిందే. కడప జిల్లా అట్లూరు మండలం ముత్తుకూరుకు చెందిన నరసింహులు(26), బద్వేల్‌లోని రూపవరం పేటకు చెందిన ఝాన్సీ(26) బైకుపై పెంచలకోనకో వచ్చారు. తిరిగి వెళ్తుండగా చెట్టును ఢీకొట్టారు. యువతి అక్కడికక్కడే మృతిచెందగా.. బద్వేలు ఆసుపత్రికి తరలిస్తుండగా యువకుడి మృతి చెందాడు. మర్రిపాడు ఎస్ఐ కేసు నమోదు చేశారు.

error: Content is protected !!