News August 21, 2025

విశాఖ: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో మరో ముగ్గురు అరెస్ట్

image

ఆల్‌లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముగ్గురిని విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. విజయనగరం జిల్లాలో మెంటాడకు చెందిన బొడ్డు తిరుపతి (25), గొట్టాపు నాగేంద్రబాబు (25), రాపర్తి నాగేశ్వరరావు(25)ను అరెస్టు చేసి వారి నుంచి 3 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫోన్ల ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటి వరకు 8 మందిని అరెస్ట్ చేయగా.. బుధవారం ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు.

Similar News

News March 22, 2026

విశాఖ: ప్రభుత్వ కార్యాలయాల్లో రేపు పీజీఆర్ఎస్

image

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) నిర్వహిస్తున్నట్లు కమిషనర్ కేతన్ గర్గ్ తెలిపారు. ఉదయం 11 నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. జీవీఎంసీలోని అన్ని జోనల్ కార్యాలయాల్లో, కలెక్టరేట్లో, సీపీ కార్యాలయంలో ఉదయం వినతులు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News March 22, 2026

విశాఖ: ఆక్టోపస్ టీం మాక్ డ్రిల్

image

నగరంలో శనివారం రాత్రి 11 గంటల నుంచి ఆదివారం వేకువజాము వరకు కైలాసగిరి, సత్యం కూడలిలో గల విప్రో కంపెనీ వద్ద ఆక్టోపస్ టీం విశాఖ నగర సిటీ పోలీస్ బాంబు స్క్వాడ్‌తో కలిసి మాక్ డ్రిల్ నిర్వహించింది. అకస్మాత్తుగా ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినట్లయితే దాని నుంచి వీఐపీలను ఎలా కాపాడాలి, ఎలా బయటపడాలి అనే కోణంలో ఈ మాక్ డ్రిల్ నిర్వహించినట్లు వారు తెలిపారు.

News March 22, 2026

విశాఖ: మహిళ ఆత్మహత్యాయత్నం

image

ఆరిలోవలోని గృహిణి ఆత్మహత్యకు ప్రయత్నించడంతో బంధువులు గుర్తించి ఆసుపత్రికి తరలించారు. ఆరిలోవ సీఐ మల్లేశ్వరరావు వివరాల ప్రకారం.. శ్వేత అనే మహిళ భర్తతో విభేదాల కారణంగా పాతగరువులో ఉంటున్నారు. శనివారం రాత్రి ఆడపడుచు ఉంటున్న ఎస్సైజీనగర్ ఇంటికి శ్వేత వెళ్లగా వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో శ్వేత వెంటనే అదే ఇంట్లో ఓ గదిలోకి వెళ్లి ఉరివేసుకోగా తలుపులు పగలగొట్టి ఆసుపత్రికి తరలించారు.